Madhavan: కొత్త కాంట్రవర్సీ.. ఆ సినిమాలు చివరిదాకా చూడలేకపోయా

విధాత: మన ఇండియన్ సెలబ్రిటీలు తమ కెరీర్, నటనతోనే కాకుండా తమ వ్యాఖ్యలతోనూ ఇటీవల బాగా వార్తల్లో నిలుస్తున్నారు. తీరా సోషల్ మీడియా అరంగేట్రం తర్వాత ఈ వ్యవహారం మరింతగా పెరిగింది. ఈ మధ్య ప్రపంచమంతా కల్కి సినిమాకు ప్రశంసలు కురిపిస్తే మన దగ్గర కొంత మంది మాత్రం విమర్శలు గుప్పించారు. కొందరు అతి మేధావులు హాలీవుడ్ సినిమాలు అర్థం కాకపోయినా మెచ్చుకోకపోతే మనల్ని మేధావులుగా గుర్తించరని తెగ పొగిడేస్తూ ఉంటారు.
ఈ కోవలోనే అవతార్ (Avatar) సినిమా నాకేం నచ్చలేదని నిర్మాత నాగవంశీ (Nagavamshi) చేసిన కామెంట్ల మీద. పెద్ద రాద్ధాంతం చేశారు. ఇటీవల సినీ నటుడు మాధవన్ (Madhavan) కూడా ఇలాటి అభిప్రాయాన్నే వేలుబుచ్చేడు హాలీవుడ్ (Hollywood) తన వైభవాన్ని కోల్పోయిందని, గత అయిదేళ్ళుగా ఏ సినిమా తనకు నచ్చలేదని కుండ బద్దలు కొట్టేశారు. ప్రపంచమంతా మెచ్చుకుని బోలెడు అవార్డులు దక్కించుకున్న క్రిస్టోఫర్ నోలన్ (Nolan) ఓపెన్ హైమర్ తనను నిరాశ పరిచిందని చెప్పడం గమనార్హం. ఇక జోకర్ 2 మూవీ విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మూవీ దారుణంగా అనిపించిందని, సినిమా చివరిదాకా చూడలేకపోయానని అన్నాడు.
మాధవన్ ఏ ఉద్దేశంతో చెప్పినా ఇందులో నిజం లేకపోలేదు. ఒకప్పుడు జురాసిక్ పార్క్, మమ్మీ, గాడ్జిల్లా, స్పైడర్ మ్యాన్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ పట్టుమని వారం ఆడటమే కష్టమైపోయే రేంజ్ కు ఇంగ్లీష్ సినిమాల ప్రమాణాలు తగ్గిపోయాయి. ఆస్కార్లు రావొచ్చు, ఎక్కడో విదేశాల్లో వేల కోట్లు వసూలు చేయొచ్చు. కానీ మన ఆడియన్స్ ని మెప్పించలేనప్పుడు ఇండియాలో ఫెయిల్యూర్ గానే పరిగణించాలి. అంతేకాదు గడిచిన రెండు మూడేండ్లుగా థియేటర్లలోకి వచ్చిన మార్వెల్, సూపర్ హీరోస్ సినిమాలన్నీ తీవ్రంగా నిరాశపర్చడం కూడా ఇందుకు ఉదాహారణగా చెప్పుకోవచ్చు.
RRR జపాన్ లో ఏడాది ఆడింది. చైనాలో అమీర్ ఖాన్ సినిమాలకు ఆదరణ దక్కింది. కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు యుఎస్ లో టాలీవుడ్ హిట్ చిత్రాలకు మిలియన్ వసూళ్లు చాలా సింఫుల్ అయ్యాయి. ఇవి భాషతో సంబంధం లేకుండా సక్సెసైనవి. ఒకప్పుడు ఇంటర్ స్టెల్లార్ లాంటి వాటిని కూడా అర్థం కాకపోయినా పొగడ్తలు కురిపించే వాళ్ళు. తీరా థియేటర్లో చూస్తే సరిగా అర్థం కాక జుత్తు పట్టుకునే జనాలు పెరిగిపోయారనేది వాస్తం. ఇదిలాఉండగా మాధవన్ (Madhavan) నటించిన ఇసాఫ్ బరబార్ అనే చిత్రం తాజాగా OTT లో రిలీజ్ అవగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణనే దక్కించుకుంటోంది.