Sameer Khakhar | సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు సమీర్ ఖఖర్ మృతి
Sameer Khakhar | సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుక్నుది. ఇటీవల బాలీవుడ్ నటుడు సతీశ్ కౌశిక్ మరణం నుంచి చిత్ర పరిశ్రమ తేరుకోక ముందే.. మరో నటుడు సమీర్ ఖఖర్ కన్నుమూశారు. 1986 లో వచ్చిన నుక్కడ్ అనే టీవీ సిరీస్‌తో గుర్తింపు పొందిన సమీర్ అనంతరం బాలీవుడ్‌లో టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించాడు. దాదాపు 50కిపైగా చిత్రాల్లోనూ నటించాడు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో సమీర్ బాధపడుతున్నారు. ఈ […]

Sameer Khakhar | సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుక్నుది. ఇటీవల బాలీవుడ్ నటుడు సతీశ్ కౌశిక్ మరణం నుంచి చిత్ర పరిశ్రమ తేరుకోక ముందే.. మరో నటుడు సమీర్ ఖఖర్ కన్నుమూశారు. 1986 లో వచ్చిన నుక్కడ్ అనే టీవీ సిరీస్‌తో గుర్తింపు పొందిన సమీర్ అనంతరం బాలీవుడ్‌లో టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించాడు. దాదాపు 50కిపైగా చిత్రాల్లోనూ నటించాడు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో సమీర్ బాధపడుతున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమీర్ ఖఖర్ మృతిపై అతని సోదరుడు గణేశ్ ఖఖర్ మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. శరీరంలో చాలా వరకు అవయవాల పనితీరు దెబ్బతిందని, దవాఖానాలో చికిత్స పొందుతూనే తెల్లవారు జామున మరణించినట్లు వివరించారు. సమీర్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖలు సంతాపం ప్రకటించారు.