అసభ్యంగా తాకుతూ.. చెత్త కామెంట్లు చేశాడు.. దర్శకుడిపై నటి ఆరోపణలు
విధాత: ఇప్పటికే మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ దర్శకుడు సాజీద్ ఖాన్‌పై మరో నటి సంచలన ఆరోపణలు చేసింది. షెర్లిన్ చోప్రా, మందన కరీమి, కనిష్కా సోని, ఆహానా కుమ్రా, సలోని చోప్రా, రాణి ఛటర్జీ డైరెక్టర్ తమను వేధింపులకు గురి చేశాడని ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మారాఠీ నటి జయశ్రీ గైక్వాడ్ చేసింది. సాజిద్‌తో తనకు జరిగిన చేదు అనుభవాన్ని తెలిపింది. మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి […]

విధాత: ఇప్పటికే మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ దర్శకుడు సాజీద్ ఖాన్‌పై మరో నటి సంచలన ఆరోపణలు చేసింది. షెర్లిన్ చోప్రా, మందన కరీమి, కనిష్కా సోని, ఆహానా కుమ్రా, సలోని చోప్రా, రాణి ఛటర్జీ డైరెక్టర్ తమను వేధింపులకు గురి చేశాడని ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మారాఠీ నటి జయశ్రీ గైక్వాడ్ చేసింది.
సాజిద్‌తో తనకు జరిగిన చేదు అనుభవాన్ని తెలిపింది. మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నానన్న జయశ్రీ.. ఎనిమిది సంవత్సరాల కింద ఓ కాస్టింగ్ డైరెక్టర్ నన్ను సాజిద్ ఖాన్‌ను పరిచయం చేశాడని పేర్కొంది. ఆ సమయంలో తనను రేపు ఆఫీసుకు రావాలని, ఓ సినిమా చేస్తున్నానని అందులో ఏదో అవకాశం ఇచ్చే అవకాశం ఉందని చెప్పాడని నటి పేర్కొంది.
మర్నాడు ఆఫీస్‌కి వెళితే.. తన బాడీపై అక్కడక్కడ చట్ చేస్తూ డర్టీ కామెంట్లు చేశాడని వాపోయింది. నువ్వు అందంగా ఉన్నావ్, నీకు ఎందుకు పని ఇవ్వాలి? అని అడిగితే.. తాను బాగా నటించగలనని సమాధానం ఇచ్చినట్లు చెప్పింది. నటన పనికిరాదని చెప్పాడని, తాను చెప్పినట్లు చేయాలని చెప్పాడని చెప్పుకొచ్చింది.
అతని వ్యవహార తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారంటూ సాజిద్ ఖాన్‌తో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నది. ప్రస్తుతం బిగ్‌బాస్-16 కంటెస్టెంట్‌గా ఉండగా.. షో నుంచి బయటకు పంపాలనే డిమాండ్లు వచ్చాయి. సాజిద్‌ఖాన్ దర్శకత్వానికి ముందు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. 2006లో ‘డర్నా జరూరీ హై’తో చిత్రంతో దర్శకుడిగా మారాడు. పలు టీవీ షోలకు హోస్ట్‌గా, జడ్జిగానూ పని చేశాడు