సినీ పరిశ్రమలో మరో విషాదం.. నటి తునీషా శర్మ ఆత్మహత్య
విధాత, ముంబై: సినిమా పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. టీవీ సెట్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన కొందరు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తునీషా శర్మ ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీరియల్ సెట్‌లోనే నటి ఆత్మహత్య చేసుకుందన్న వార్త […]

విధాత, ముంబై: సినిమా పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. టీవీ సెట్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన కొందరు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తునీషా శర్మ ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీరియల్ సెట్‌లోనే నటి ఆత్మహత్య చేసుకుందన్న వార్త కలకలం సృష్టిస్తున్నది. తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.
సీరియల్ నటి తునీషా ఆత్మహత్య కేసులో.. సహనటుడు షీజన్ ఖాన్ అరెస్ట్..!
తొలిసారి ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’లో నటించింది. సోనీ సబ్ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్రలో నటిస్తుంది. ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాలతో పాటు పలు సీరియల్స్‌లో నటించింది.
కాగా ఆత్మహత్య కు కొద్దిసేపటి ముందు తునీషా శర్మ షూటింగ్ సెట్లో మేకప్ వేసుకుంటుండగా తీసిన వీడియోను తునీషా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో ఆమె చేతి మణికట్టు మీద కోసుకున్నట్లు మేకప్ మెన్ గీత పెట్టాడు. ఆ టేక్ తర్వాతే తునీషా ఆత్మహత్య చేసుకుంది.