Aditi Rao Hydari: అసలు విషయం చెప్పకుండా.. ఎందుకీ డొంక తిరుగుడు మాటలు?

విధాత‌, సినిమా: గతంలో సమంత (Samantha)ను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ చెప్పి సైలెంట్‌గా ఉన్న సిద్ధార్థ(Siddhartha) పై మరోసారి డేటింగ్ (dating) రూమర్లు వెల్లువెత్తుతున్నాయి. నటి అదితీరావు హైద‌రీ (Aditi Rao Hydari), సిద్ధార్థ మధ్య ఏదో ఉందని వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనేలా పుకార్లు నెట్టింట్లో బ్రేకింగ్ న్యూస్‌గా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే వారిద్దరి ప్రవర్తన ఉండటం విశేషం. ఓ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో అదితి పోస్ట్ చేయడంతో ఈ రూమ‌ర్స్‌కు నెట్టింట మరింతగా […]

  • Publish Date - March 7, 2023 / 01:45 PM IST

విధాత‌, సినిమా: గతంలో సమంత (Samantha)ను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ చెప్పి సైలెంట్‌గా ఉన్న సిద్ధార్థ(Siddhartha) పై మరోసారి డేటింగ్ (dating) రూమర్లు వెల్లువెత్తుతున్నాయి. నటి అదితీరావు హైద‌రీ (Aditi Rao Hydari), సిద్ధార్థ మధ్య ఏదో ఉందని వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనేలా పుకార్లు నెట్టింట్లో బ్రేకింగ్ న్యూస్‌గా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే వారిద్దరి ప్రవర్తన ఉండటం విశేషం. ఓ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో అదితి పోస్ట్ చేయడంతో ఈ రూమ‌ర్స్‌కు నెట్టింట మరింతగా ఆద్యం పోసిన‌ట్ల‌యింది.

అదితీ రావు హైద‌రి (Aditi Rao Hydari)తో కలిసి చేసిన రీల్స్‌ను ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేసింది. నెట్‌లో పాపులర్ అయిన సాంగ్‌కు ఈ జోడి కలిసి డాన్స్ చేసింది. దీంతో మరోసారి వీరి డేటింగ్‌పై రూమ‌ర్లు విజృంభించాయి. అయితే తాజాగా అధితి ఓ ఇంట‌ర్వ్యు‌లో ఈ రూమర్స్‌పై ఘాటుగానే స్పందించింది. మేము ఏం చేస్తే మీకు ఎందుకు? అని ఫైర్ అయింది. రీసెంట్‌గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ గురించి అదితి స్పందించింది.

నేను నటిగా కొన్ని సినిమాలలో చేస్తున్నాను. ప్రస్తుతం నా కెరియర్‌పైనే దృష్టి పెట్టాను. మీరు నాలో నటిని గుర్తించ‌నంత వ‌ర‌కు నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. సినిమాల గురించి నా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి నన్ను అడగండి. వివరంగా మీకు చెప్తాను.

కానీ దయచేసి నా వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టండి… అని ఫైరయిందీ భామ. అంతేకానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని మాత్రం ఈ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో.. వారిద్దరి మధ్య వ్యవహారం నడుస్తుంది కాబట్టే.. ఆమె ఇలా స్పందించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.