Rooster | మీరూ కోళ్లను పెంచుతున్నారా జాగ్రత్త మరి..! ఈ కోడి యజమాని ప్రాణాలనే తీసింది..!
Rooster | ఓ కోడి యజమానిపైనే దాడి చేసి చంపేసింది. అవును మీరు చదివింది నిజమే..! ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకున్నది. ఓ వ్యక్తి జాస్పర్ క్రాస్ (67) కిల్లాహోర్నియాలో నివాసం ఉంటాడు. అతనికి జంతువులు, పక్షులు అంటే ఇష్టం. ఈ క్రమంలో తన ఇంటి ఆవరణలో పెంపుడు జంతువులు కోళ్లు, కుక్కలు, పిల్లులు పెంచుతూ చిన్నపాటి పౌల్ట్రీని నిర్వహిస్తున్నాడు. క్రాస్ సొంతంగా స్వయంగా చూసుకునేవాడు. క్రాస్ ఇంట్లో బ్రహ్మ కోడి సైతం ఉన్నది. ఇది […]

Rooster | ఓ కోడి యజమానిపైనే దాడి చేసి చంపేసింది. అవును మీరు చదివింది నిజమే..! ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకున్నది. ఓ వ్యక్తి జాస్పర్ క్రాస్ (67) కిల్లాహోర్నియాలో నివాసం ఉంటాడు. అతనికి జంతువులు, పక్షులు అంటే ఇష్టం.
ఈ క్రమంలో తన ఇంటి ఆవరణలో పెంపుడు జంతువులు కోళ్లు, కుక్కలు, పిల్లులు పెంచుతూ చిన్నపాటి పౌల్ట్రీని నిర్వహిస్తున్నాడు. క్రాస్ సొంతంగా స్వయంగా చూసుకునేవాడు. క్రాస్ ఇంట్లో బ్రహ్మ కోడి సైతం ఉన్నది. ఇది కోడి చాలా దూకుడుగా ఉండేది. ఎప్పట్లానే జాస్పర్ క్రాస్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న సమయంలో కాలి వెనుక భాగంలో ఈ కోడి దాడి చేసింది.
దాడి తీవ్రతకు భారీగా రక్తస్రావం జరిగింది. అదే సమయంలో గుండెపోటురావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని క్రాస్ తనయ వర్జీనియా గినాన్ తెలిపింది. ఈ కోడిగతంలో తన కూతురుపై సైతం దాడి చేసిందని చెప్పింది. ఈ బ్రహ్మకోళ్లు చైనాలోని షాంఘై ప్రాంతానికి చెందినవి. మాంసం, గుడ్ల కోసం ఎక్కువగా వీటిని పెంచుతూ వస్తుంటారు.
ఈ చికెన్ బరువు సగటున 10 నుంచి 12 పౌండ్ల వరకు ఉంటుంది. కానీ, క్రాస్‌పై దాడి చేసిన కోడి బరువు మాత్రం ఏకంగా 18 పౌండ్లు ఉంటుదని, కోడిని ప్రమాదకరం కాదు అనుకోవడానికి వీల్లేదని గినాన్ తెలిపింది. పెంపుడు జంతువులు, పక్షులు చిన్నవైనా పెద్దవైనా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించింది. ఈ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.