ఆగ్రాలో కలకలం.. చైనా నుంచి వ్యక్తికి కరోనా పాజిటివ్
Covid-19 | ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమై విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది. అయితే, చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా.. ఆదివారం వైరస్ సోకినట్లుగా తేలింది. షాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చైనాకు వెళ్లారు. తిరిగి ఈ నెల 23న […]

Covid-19 | ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమై విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది. అయితే, చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా.. ఆదివారం వైరస్ సోకినట్లుగా తేలింది.
షాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చైనాకు వెళ్లారు. తిరిగి ఈ నెల 23న ఆగ్రాకు ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చాక ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా టెస్ట్ రిపోర్ట్ ఆదివారం రాగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్ ఆరోగ్యశాఖకు సమాచారం అందించింది.
దీంతో ఆరోగ్యశాఖ బృందం సదరు వ్యక్తి ఇంటికి చేరుకొని వివరాలు తెలుసుకున్నది. వ్యక్తి ఇద్దరు కాంటాక్టులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని పంపామని డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే, అతనికి ఏ వేరియంట్ సోకిందనే వివరాలు తెలియలేదు. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7తో విజృంభిస్తున్న విషయం తెలిసిందే.