‘ఆహా’ ఏమి ఐడియా.. థియేటర్లలో ‘ప్రభాస్’ ఎపిసోడ్!
మరో లెవల్‌కు ‘అల్లు’ ఆలోచన విధాత: ఏది ఏమైనా మార్కెటింగ్, బిజినెస్ బుర్ర అంటే ఆహా అధినేత అల్లు అరవింద్‌దేనని ఒప్పుకోవాలి. ఆయన శత్రువులు, పోటీదారులు కూడా ఇది నిజమనేలా చేయడం అల్లు వారి సొంతం. ఆయన చేసే, ప్రారంభించే పనులు మొదట్లో తెలివి తక్కువగా అందరికీ కనిపిస్తాయి. కానీ రాబోయే కాలంలో అవే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తాయి. ఇక విషయానికి వస్తే ఆహాలో బాలయ్యతో అన్ స్టాపబుల్ షో అనేది ఒక గ్రేట్ ఐడియా. అదే […]

మరో లెవల్‌కు ‘అల్లు’ ఆలోచన
విధాత: ఏది ఏమైనా మార్కెటింగ్, బిజినెస్ బుర్ర అంటే ఆహా అధినేత అల్లు అరవింద్‌దేనని ఒప్పుకోవాలి. ఆయన శత్రువులు, పోటీదారులు కూడా ఇది నిజమనేలా చేయడం అల్లు వారి సొంతం. ఆయన చేసే, ప్రారంభించే పనులు మొదట్లో తెలివి తక్కువగా అందరికీ కనిపిస్తాయి. కానీ రాబోయే కాలంలో అవే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తాయి.
ఇక విషయానికి వస్తే ఆహాలో బాలయ్యతో అన్ స్టాపబుల్ షో అనేది ఒక గ్రేట్ ఐడియా. అదే ఒక చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున ఇలా ఎవరైనా ఈ షో కి అంత క్రేజ్ వచ్చేది కాదు. కానీ అల్లు అరవింద్ బుర్ర, చూపు బాలయ్య బాబుపై పడ్డాయి.
ఇంకేముంది చాలామంది ముందుగానే గెస్ చేసినట్టు అన్‌స్టాపబుల్ షో విత్ ఎన్బికే సంచలనాలు సృష్టిస్తోంది. మొదట్లో ఇలాంటి షోలకు తగిన వాక్చాతుర్యం బాలయ్యకు లేదన్న వారు కూడా.. నేడు ఆహాలోని ఈ షోని చూసి ఓహో అంటున్నారు. ఇది మొదటి సీజన్ సంగతి.
రెండో సీజన్ మరో ఎత్తు. మొదటి సీజన్‌కు మించి అన్నట్టుగా ఈ షో సాగుతోంది. ఇటీవలే పెదనాన్న కృష్ణంరాజును పోగొట్టుకున్న ప్రభాస్‌ను ఈ షోకి పిలిచారు. వాస్తవంగా, నైతికంగా ఆలోచిస్తే ఇది సమయం కాకపోయినా బిజినెస్ పరంగా, జనాల క్యూరియాసిటీ పరంగా ఇదే సరైన సమయం. అది అల్లుగారికి బాగా తెలుసు.
ఇక ఈ సీజన్లో ఒక్కో షోకి ఇద్దరు అతిథులను ఆహ్వానిస్తున్నారు. అందుకే ఇద్దరు గెస్ట్ ల కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. ప్రభాస్ అదేనండి మన డార్లింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మ్యాచో స్టార్ గోపీచంద్‌ని.. తనతో కూడా తీసుకుని వచ్చాడు.
డిసెంబర్ 11న ఆదివారం షూటింగ్ కావడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక షూట్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ లీక్ అయ్యి నెట్టింట హంగామా చేశాయి. దాంతో అఫీషియల్‌గా రిలీజ్ చేయడమే బెస్ట్ అనుకుని.. షోకి సంబంధించిన ఫొటోలు రిలీజ్ చేశారు.
ప్రభాస్ షర్ట్.. బాలయ్య, గోపిచంద్‌లకు ప్రభాస్ ఇంటి నుండి బిర్యాని చేయించుకుని రావడం, బాలయ్య ఏ ఏ ప్రశ్నలు అడిగాడు? పెళ్లి గురించే అడిగితే ప్రభాస్ ఏం చెప్పాడు? ఫోన్లో రాంచరణ్ ఏమన్నాడు? ఇలా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇక లాభం లేదనుకొని డిసెంబర్ 13 మంగళవారం రాత్రి 11:15 కల్లా గ్లిమ్స్ వదిలారు.
డార్లింగ్ ఎంట్రీ ఒకే ఒక డైలాగ్ కొన్ని బావ బావలు తప్ప ఇంకేమీ లేదు. ఇదేందీ ఇది అని కొంతమంది కామెంట్ చేస్తున్నా.. మెజార్టీ శాతం గ్లింప్స్ అంటేనే ఇలాగే ఉంటాయి. ట్రైలర్ వస్తేనే అసలు కిక్ అంటున్నారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ గురించి కూడా పలు ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్‌ని డిసెంబరు 31 సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్ చేయనున్నారనే వార్త వైరల్ అవుతుంది.. ఎందుకంటే న్యూ ఇయర్ హంగామా సాయంత్రం 6 గంటలకి మొదలవ్వడం ఖాయమని అందరికీ తెలుసు.
జనవరి 1న ప్రసారం చేయాలంటే చాలా మంది న్యూ ఇయర్ హాంగోవర్లో ఉంటారు. దాన్నుంచి బయటకు రాలేరు. విషయం అర్థం అయ్యే ఉంటుంది. రాత్రి చేసిన హంగామా… తిన్న తిండి…. తాగిన మందు ఉదయానికి దిగవు. కాబట్టే డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటలకు నిర్ణయం తీసుకున్నారు.
క్రికెట్ మ్యాచ్‌లు, స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లను ఈమధ్య థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దానికి ఎంతో క్రేజ్. భారీ అంచనాల మధ్య రాబోతున్న అన్‌స్టాపబుల్ షో లోని ప్రభాస్ ఎపిసోడ్‌ను కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని నిర్ణయించిన థియేటర్లలో ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా మన అల్లు వారికి తట్టింది.
గంటలోపు ఉండే ఈ ఎపిసోడ్ కోసం ఈ విధమైన ప్లానింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ షో ద్వారా ‘ఆహా’ రేంజ్‌ని నెట్ ఫ్లిక్స్ అమెజాన్ తరహాలో మరో లెవెల్ కి తీసుకొని పోయి ఓహో అనిపించడమే మన అల్లు వారి లక్ష్యంగా కనిపిస్తోంది.
Darlings…
Here’s the most awaited and anticipated glimpse from #UnstoppableWithNBKS2