ఆహా.. ప్రభాస్ తర్వాత పవర్ స్టారే!

విధాత: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్ స్టాఫబుల్ విత్ ఎన్ బి కే. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ఆధ్వర్యంలో రూపొందిన ఈ అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బికె సీజన్ వన్ నెంబర్ వన్ పొజిషన్లో నిలబడింది. అంతేకాదు ఈ షో బాలకృష్ణలోని కొత్త కోణం వెలుగులోకి తీసుకుని వ‌చ్చింది. ఆయన టాక్ షోను రన్ చేస్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో రీసెంట్‌గా అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ […]

  • By: krs    latest    Dec 17, 2022 1:49 PM IST
ఆహా.. ప్రభాస్ తర్వాత పవర్ స్టారే!

విధాత: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్ స్టాఫబుల్ విత్ ఎన్ బి కే. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ఆధ్వర్యంలో రూపొందిన ఈ అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బికె సీజన్ వన్ నెంబర్ వన్ పొజిషన్లో నిలబడింది. అంతేకాదు ఈ షో బాలకృష్ణలోని కొత్త కోణం వెలుగులోకి తీసుకుని వ‌చ్చింది. ఆయన టాక్ షోను రన్ చేస్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

దీంతో రీసెంట్‌గా అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 స్టార్ట్ అయింది. సీజన్ వన్ లో రానటువంటి సెలబ్రిటీలు సీజన్ 2 లో కనిపించబోతున్నారు. చిరంజీవి, నాగార్జున వంటి అగ్రతార‌లు సైతం బాలకృష్ణ ప్రశ్నలను ఫేస్ చేయబోతున్నారు. ఈ క్రమంలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్ స్టాపబుల్ లో గెస్ట్ గా రాబోతున్నారని వార్తలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు త్వరలోనే నిజం అవుతాయనిపిస్తోంది.

ఎందుకంటే అన్ స్టాప‌బుల్‌లో స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారనేది పక్కా అయింది. రీసెంట్గా అన్ స్టాప‌బుల్‌ ఎన్ బి కే సీజన్ 2 లో ఎపిసోడ్ 2 సందర్భంగా అందులో బాలకృష్ణ.. త్రివిక్రమ్‌తో మాట్లాడుతూ అన్ స్టాపబుల్ షోకి రావాలంటూ ఆహ్వానించారు. దానికి త్రివిక్రమ్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానండీ అన్నారు. దానికి బాలయ్య రిప్లై ఇస్తూ తెలుసుగా ఎవరితో రావాలో అని చెప్పారు.

బాలయ్య ఆన్సర్ లోనే అన్ స్టాప‌బుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నారని కన్ఫర్మ్ అయిందని ప్రోమో చూసిన వాళ్లు ఇట్టే చెప్పొచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లు చాలా మంచి స్నేహితులు. సో త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ షోకి రావడం పక్కా. ఎందుకంటే సీజన్ 2 లో ప్రతి ఎపిసోడ్లో ఇద్దరు గెస్ట్‌లు వస్తున్నారు. బాగా స‌న్నిహితంగా ఉన్న ఇద్దరిని కలగలిపి బాలయ్య తన ప్రశ్నలతో ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్బికె రోజు రోజుకి ఎవరు ఊహించని రేంజ్ లో దూసుకుపోతోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతోంది.

ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి మ్యాచో స్టార్ గోపీచంద్ కలిసి హాజరైన షో షూటింగ్ జరిగింది. దానికి సంబంధించిన చిన్న ప్రోమో గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. ఎప్పుడెప్పుడు ఈ షో ప్రసారం అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంద‌ని తెలుస్తోంది. చాలా కాలం నుండి పవన్ కళ్యాణ్ ఈ టాక్‌షో కి చివరి ఎపిసోడ్ కి రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించేవి.

పవన్ కళ్యాణ్ ఇలాంటి టాక్ షో కి రావడం ఏమిటి ఇదంతా కేవలం ఒట్టి పుకారు మాత్రమే అని అందరూ అనుకున్నారు. చాలా రోజుల నుండి ఆహా టీం పవన్ డేట్స్ కోసం పడి కాపులు కాస్తూనే ఉన్నారు. మొత్తానికి ఎపిసోడ్లో పాల్గొనేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే డేట్స్ చూసి చెప్తానని షూటింగ్ సిద్ధం చేసుకోమని పవన్ కళ్యాణ్ ఆహా టీం కి చెప్పాడట. సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ప్ర‌సారం అవుతుంద‌ని వార్త‌లు వస్తున్నాయి. అలా చూస్తే.. ప్రభాస్ తర్వాత పవర్ స్టారే అని చెప్పుకోవచ్చు.

అప్పుడప్పుడు ఏదో కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం మినహా ఎప్పుడు ఇలాంటి టాక్‌ షోస్ పై ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ఇప్పుడు బాలయ్య బాబుతో షోకి రాబోతుండడం పెద్ద చర్చకు దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన చిరకాల మిత్రులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోతున్నాడు.

తెలుగుదేశంకి చెందిన బాలకృష్ణ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంకు మద్దతు ఇస్తాడని ప్రచారంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే షోలో రావడం అంటే పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ షో మొదటి ఎపిసోడ్‌లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లు హాజరైన సంగతి ఇక్కడ గమనార్హం.