తారకరత్న: పుట్టిన రోజు నాడే చిన్న కర్మ.. ఇదే మా చివరి ట్రిప్.. అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరితరం?
Tarakaratna విధాత: సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా, నందమూరి ఫ్యామిలీలతో పాటు ఇండస్ట్రీని కూడా ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. నందమూరి ఫ్యామిలీతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ వర్గీయులు సైతం ఈ విషయాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు. ఆయన ఇక లేడనే విషయాన్ని నిజమని నమ్మలేక పోతున్నారు. మూడు రోజుల్లో పుట్టిన రోజు అనగా తారకరత్న శివరాత్రి నాడు తుది శ్వాస విడిచాడు. తారకరత్న చిన్న కర్మనాడే […]

Tarakaratna
విధాత: సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా, నందమూరి ఫ్యామిలీలతో పాటు ఇండస్ట్రీని కూడా ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. నందమూరి ఫ్యామిలీతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ వర్గీయులు సైతం ఈ విషయాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు. ఆయన ఇక లేడనే విషయాన్ని నిజమని నమ్మలేక పోతున్నారు. మూడు రోజుల్లో పుట్టిన రోజు అనగా తారకరత్న శివరాత్రి నాడు తుది శ్వాస విడిచాడు.
తారకరత్న చిన్న కర్మనాడే ఆయన పుట్టినరోజు కావడం అందరినీ మరింత కలచి వేసింది. అదే రోజున భార్య అలేఖ్య రెడ్డి కూతురు నిష్కా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దాంతో అలేఖ్య రెడ్డి తన భర్తను ఎంత ఆరాధించిందో, ప్రేమించిందో ఇప్పుడు ఎంతలా మిస్ అవుతుందో అర్థమైంది.
అయితే తాజాగా ఆమె మరోసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. తారకరత్న పిల్లలతో కలిసి తిరుపతిలో దైవదర్శనం అనంతరం దిగిన ఫోటోని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లోని ఫోటో గురించి చెబుతూ.. ఇదే మేము ఆయనతో చివరిగా దిగిన ఫోటో. ఇదే మా చివరి ట్రిప్. ఇవన్నీ నమ్మాలంటే నా గుండె బద్దలవుతుంది. ఇదంతా కల అయితే బాగుండని కోరుకుంటున్నా.
నన్ను రోజూ.. అమ్మ బంగారు అని పిలిచే నీ గొంతు వినాలని ఉంది.. అని ఎమోషనల్ అయింది అలేఖ్య రెడ్డి. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆమె ధైర్యంగా ఉండాలని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. తారకరత్న పెద్దకర్మను మార్చి 2న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించనున్నారు.
View this post on Instagram