మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న అలియా భట్
విధాత: అలియా భట్.. ఈమె పేరు నిన్నటి దాకా దేశవ్యాప్తంగా తెలుసు. నేటి తరానికి రోల్ మోడల్. డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలో సీతగా ఈమె తెలుగు ప్రేక్షకులను సైతం కట్టి పడేసింది. ఎలాగూ పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ చిత్రం కాబట్టి ఈ మూవీ ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఆమె పోషించిన సీత పాత్రకు మంచి ప్రశంసలు కూడా లభించాయి. ఈమె ఆ మధ్య తన […]

విధాత: అలియా భట్.. ఈమె పేరు నిన్నటి దాకా దేశవ్యాప్తంగా తెలుసు. నేటి తరానికి రోల్ మోడల్. డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలో సీతగా ఈమె తెలుగు ప్రేక్షకులను సైతం కట్టి పడేసింది. ఎలాగూ పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ చిత్రం కాబట్టి ఈ మూవీ ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఆమె పోషించిన సీత పాత్రకు మంచి ప్రశంసలు కూడా లభించాయి. ఈమె ఆ మధ్య తన ప్రియుడు రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది.
ఆయనతో ప్రేమలో పడి 14 ఏప్రిల్, 2022న వివాహ బంధంతో ఒకటయ్యారు. నవంబర్ 6వ తేదీన వారికి ఓ పాప జన్మించింది. ఇలా ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో శుభవార్తలు బాగానే వినిపించాయి. కొందరు అమ్మానాన్నలుగా కూడా ప్రమోట్ అయ్యారు. ఇదే ఏడాది పెళ్లి పీటలు ఎక్కి శుభవార్త చెప్పిన అలియా రణబీర్‌లు అమ్మానాన్నలుగా కూడా ప్రమోషన్ పొంది ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వీరు తమ బిడ్డకు రేహాకపూర్ అనే పేరు పెట్టారు. రణబీర్ కపూర్ కూడా సినిమా షూటింగులకు కాస్త గ్యాప్ వచ్చిన వెంటనే భార్యా బిడ్డలతో మధురానుభూతులు అనుభవిస్తున్నాడు.
వాస్తవంగా వీరు కొంతకాలంగా ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. అలియా భట్ ప్రెగ్నెన్సీ సమయంలో బాడీలో వచ్చిన మార్పులను మార్చుకోవడానికి జిమ్ యోగా వంటివి చేస్తోంది. తిరిగి ఇంతకుముందులా ఫిట్ గా తయారయ్యేందుకు తీవ్ర కృషి చేస్తోంది. అలియా భట్ రణబీర్‌కపూర్లు చివరగా బ్రహ్మాస్త్ర చిత్రంలో నటించారు. అలియా భట్ సినిమాలో గ్యాప్ తీసుకుని కూతుర్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది.
తాజాగా సోషల్ మీడియాలో ఆమె తన మాతృత్వ మధురిమలను పంచుకుంది. ఈ ఫోటోలలో ఆమె తన కూతురితోపాటు ఆనందాన్ని ఎంజాయ్ చేస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్టు ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఎరుపు రంగు చీరలో నవ్వుతూ ఆమె తన కూతురికి ఫీడింగ్ చేస్తున్నది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు అలియా భట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చాలామంది హీరోయిన్లు సరొగసీ ద్వారా బిడ్డలను కంటున్న తరుణంలో అలియా భట్ సహజ పద్ధతిలో గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. అందం చెడిపోతుందని ఇతర విధాలుగా సేకరించిన పాలను కాకుండా తల్లి పాలను ఇస్తోంది. దీని ద్వారా పాలు తాగిన బిడ్డలకు ఆరోగ్యంతో పాటు.. తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలే లేవని ఆమె తన బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇస్తోందని, ఇది మంచి పరిణామమని కితాబునిస్తున్నారు.
నిజమైన తల్లి ప్రేమ అప్పుడే తెలుస్తుంది అని సరొగసి ఇతర విధానాల ద్వారా బిడ్డలను కన్నప్పుడు తల్లి ప్రేమ తెలియదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అలియా భట్ కొంచెం లావుగా తయారైనట్టు కనిపిస్తోంది.. దీంతో బాడీని తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే షూటింగులకు అలియాభట్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆమె చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే మరోపక్క ఈ ఫోటో ఎడిట్ చేసిందని అందులో ఉన్నది అలియా కాదని కొందరు అంటున్నారు.