Amarnath Yatra | అమర్నాథ్ యాత్రలో విషాదం.. రెండు రోజుల్లోనే ఆరుగురు మృతి..!
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు వెళ్లి గత రెండు రోజుల్లోనే ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పాదయాత్రలో మరణించిన వారి సంఖ్మ తొమ్మిదికి పెరిగిందని అధికారులు తెలిపారు. అయితే, మరణాలకు సంబంధించి సమాచారం మాత్రం ఇవ్వలేదు. అయితే, మరణాలకు కారణాల్లో గుండెపోటు సాధారణ కారణాల్లో ఒకటి. ఇదిలా ఉండగా.. బాబా బోలోనాథ్ దర్శనం కోసం బేస్‌క్యాంపుల్లో 3వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేశారు. ఇందులో 2వేల మంది భక్తులు పహల్గాం […]

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు వెళ్లి గత రెండు రోజుల్లోనే ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పాదయాత్రలో మరణించిన వారి సంఖ్మ తొమ్మిదికి పెరిగిందని అధికారులు తెలిపారు. అయితే, మరణాలకు సంబంధించి సమాచారం మాత్రం ఇవ్వలేదు. అయితే, మరణాలకు కారణాల్లో గుండెపోటు సాధారణ కారణాల్లో ఒకటి. ఇదిలా ఉండగా.. బాబా బోలోనాథ్ దర్శనం కోసం బేస్‌క్యాంపుల్లో 3వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేశారు. ఇందులో 2వేల మంది భక్తులు పహల్గాం మీదుగా, మరో వెయ్యి మంది బల్తాల్ మార్గం ద్వారా మంచులింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లనున్నారు. మరో వైపు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా యాత్రను నిలిపివేశారు. బల్తాల్, పహల్గామ్ మార్గంలో ఏడో బ్యాచ్‌కు చెందిన భక్తులకు దర్శనానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. వాతావరణ పరిస్థితులను బట్టే నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.