గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ ఫొటో తప్పనిసరి

విధాత: జనవరి 26 రిపబ్లిక్ ఉత్సవాల్లో అంబేద్కర్‌ ఫొటో పెట్టి పూలమాలతో అలంకరించాలని ప్రభుత్వం సూచించింది. సాధారణంగా.. ఆగస్టు 15, జనవరి 26 జాతీయ పండుగలకు జాతీయోద్యమ నాయకుల ఫొటోలను ముఖ్యంగా గాంధీ, నెహ్రూ ఫొటోలను పెట్టటం ఆనవాయితీగా వస్తున్నది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌ ఫొటో పెట్టడం కూడా జరుగుతున్నది. అయితే… విధిగా గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్‌ ఫొటో పెట్టాలని ప్రభుత్వం సూచించటం గమనార్హం. కరోనా కారణం చూపి గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర […]

  • By: krs    latest    Jan 25, 2023 12:24 PM IST
గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ ఫొటో తప్పనిసరి

విధాత: జనవరి 26 రిపబ్లిక్ ఉత్సవాల్లో అంబేద్కర్‌ ఫొటో పెట్టి పూలమాలతో అలంకరించాలని ప్రభుత్వం సూచించింది. సాధారణంగా.. ఆగస్టు 15, జనవరి 26 జాతీయ పండుగలకు జాతీయోద్యమ నాయకుల ఫొటోలను ముఖ్యంగా గాంధీ, నెహ్రూ ఫొటోలను పెట్టటం ఆనవాయితీగా వస్తున్నది.

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌ ఫొటో పెట్టడం కూడా జరుగుతున్నది. అయితే… విధిగా గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్‌ ఫొటో పెట్టాలని ప్రభుత్వం సూచించటం గమనార్హం.

కరోనా కారణం చూపి గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటం, ఆ నేపథ్యంలో.. ఆ వేడుక‌లను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు సూచించటం తెలిసిందే.

అలాగే.. పరేడ్‌తో కూడిన ఉత్సవాలను నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజలు వీక్షించటానికి అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.