Ameesha Patel | పేమెంట్స్ సరిగా అందలేదు.. బరస్టైన అమీషా.. రివర్సైన ఫ్యాన్స్!
Ameesha Patel విధాత: ఈ హీరోయిన్ తెలుగులో నటించిన సినిమాలు రెండు మూడే అయినా.. తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ మూడు సినిమాలూ స్టార్ హీరోస్‌తో కావడమే ఇందుకు కారణం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘బద్రి’, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘నాని’, ఎన్టీఆర్‌తో నరసింహుడు సినిమాలు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉన్న చిత్రాలే. ఇందులో నటించిన ఈ వెటరన్ బోల్డ్ బ్యూటీ అమీషా పటేల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అమాషా.. పున్నానికో సినిమా చేస్తూ […]

Ameesha Patel
విధాత: ఈ హీరోయిన్ తెలుగులో నటించిన సినిమాలు రెండు మూడే అయినా.. తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ మూడు సినిమాలూ స్టార్ హీరోస్‌తో కావడమే ఇందుకు కారణం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘బద్రి’, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘నాని’, ఎన్టీఆర్‌తో నరసింహుడు సినిమాలు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉన్న చిత్రాలే. ఇందులో నటించిన ఈ వెటరన్ బోల్డ్ బ్యూటీ అమీషా పటేల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అమాషా.. పున్నానికో సినిమా చేస్తూ ఉంది.
తాజాగా అమీషా పటేల్ ‘గదర్ 2’ సినిమాలో నటించింది. సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందనే టాక్ అయితే ఉంది. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్‌గా ‘గదర్ 2’ రాబోతుంది. ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణ సంస్థపై తాజాగా అమీషా పటేల్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఏ సమస్యకు సరిగా స్పందించకపోయినా ఓ హీరోయిన్ ట్విట్ చేసినా, పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ఆమె ఫాలోయర్స్ అంతా తెగ శ్రద్ధగా ఆ సమస్య గురించి చర్చించుకుంటారు. దాని మీద స్పందించి కామెంట్స్ కూడా చేస్తారు. తాజాగా అమీషా నటించిన సినిమా గురించి ఆ సినిమా నిర్మాణ సంస్థ చెల్లించని బిల్లుల గురించి తన గోడు ట్వీట్ చేయగానే నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు.
‘గదర్ 2’ సినిమా సంస్థపై ట్విట్టర్‌లో అమీషా పటేల్ ఫైర్ అయింది. ఆమె చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ‘గదర్ 2’ సినిమా షూటింగ్ సమయంలో తనని ప్రొడక్షన్ వాళ్లు సరిగా రిసీవ్ చేసుకోలేదని, ట్రీట్మెంట్ సరిగా లేదని, ఇక మేకప్ ఆర్టిస్ట్స్, కాస్ట్యూమ్ డిజైనర్లు, మిగతా సాంకేతిక నిపుణులకు పేమెంట్స్ సరిగా అందలేదని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఎవరికీ పేమెంట్స్ సరిగా అందలేదని, ఫుడ్ బిల్స్, ట్రావెలింగ్ ఏర్పాట్లు చేయలేదని.. షూటింగ్ పూర్తి కాగానే వదిలేశారని చెప్పుకొచ్చింది. షూటింగ్ చివరి రోజున బిల్స్ చెల్లించకుండా వెళ్లి పోయారని సంచలన ఆరోపణలు చేసింది అమీషా.
‘గదర్ 2’ సినిమాని అనిల్ శర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.. వాళ్ళు రంగంలోకి దిగి మాకు ఇవ్వాల్సిన పేమెంట్స్ చెల్లించారు.. లేదంటే అందరికీ చాలా ఇబ్బంది కలిగేది. దీనికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ అని అమీషా పటేల్ తన ట్వీట్‌లో చెప్పుకొచ్చింది.
ఇక ఇదే సందు అన్నట్టు అమీషా పటేల్ ఫ్యాన్స్, నెటిజన్స్ గదర్ 2 నిర్మాణ సంస్థపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు.. సినిమా ప్రమోషన్‌కి ఇలాంటి వేషాలు వేస్తున్నారా? అని కూడా కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.