Amit Shaha Tour l అమిత్‌షా పర్యటనను జయప్రదం చేయాలి: ప్రేమేందర్‌రెడ్డి
కాషాయ సత్తా చాటాలని పిలుపు కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలి జంతర్‌మంతర్ వద్ద కవిత ధర్నా హాస్యాస్పదం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి Amit Shah's tour.. Premender Reddy విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని పరిపాలించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి(State BJP General Secretary)ప్రేమేందర్‌రెడ్డి(Premender Reddy) విమర్శించారు. కందిలో ఈనెల 12న కేంద్ర హోం మం త్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా స్థల పరిశీలిన కోసం కార్యకర్తలతో […]

- కాషాయ సత్తా చాటాలని పిలుపు
- కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలి
- జంతర్‌మంతర్ వద్ద కవిత ధర్నా హాస్యాస్పదం
- రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి
Amit Shah’s tour.. Premender Reddy
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని పరిపాలించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి(State BJP General Secretary)ప్రేమేందర్‌రెడ్డి(Premender Reddy) విమర్శించారు. కందిలో ఈనెల 12న కేంద్ర హోం మం త్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా స్థల పరిశీలిన కోసం కార్యకర్తలతో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చి కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన(Amit Shah’s tour)ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా కాషాయ సత్తా చాటాలని కోరారు. పర్యటన విజయవంతానికి కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మహిళా సాధికారతకు ప్రధాని పెద్దపీట..
ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi) మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. మహిళా సాధికారత సాధించేందుకు, వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అలాగే రాష్ట్రపతి అభ్యర్థిగా మహిళను కేటాయించి రాష్ట్రపతిగా చేశారని, కేంద్రమంత్రులుగా మహిళలను నియమించారని, కేంద్ర ఆర్థికమంత్రిగా మహిళకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. మహిళల అభ్యున్నతికి ఇంత చేస్తుంటే మార్చి 10న కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మహిళా సాధికారత కోసం జంతర్‌మంతర్(Jantar Mantar) వద్ద ధర్నా చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
అవినీతిలో కూరుకుపోయిన కల్వకుంట్ల ఫ్యామిలీ
కల్వకుంట్ల ఫ్యామిలీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. తెలంగాణలో ఏ బ్రిడ్జి చూసినా.. ఏ రోడ్డు చూసినా.. ఏ బిల్డింగ్ చూసినా అందులో కనిపించేది కల్వకుంట్ల ఫ్యామిలేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మాటలతోనే మాయ చేస్తున్నారని.. వాగ్దానాలను అమలు చేయడం లేదని విమర్శించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ ఎంపీ బూరనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, సంగారెడ్డి అసెంబ్లీ పాలక్ మోహన్‌రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్, సంగారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.