ప్రజా హక్కుల సంరక్షణకే నూతన చట్టాలు: అమిత్‌షా

విధాత : ప్రజాహక్కుల సంరక్షణ మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకే కేంద్రం పాత చట్టాలను సంస్కరించి కొత్త చట్టాలను తెచ్చిందని, త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందనుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. హైద్రాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్‌కు చెందిన 175మంది ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అలాగే గవర్నర్ తమిళ సై, డీజీపీ అంజనీ కుమార్‌లతో కలిసి నూతన ఐపీఎస్‌ల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశంలో వివిధ రకాల వ్యవస్థికృత నేరాలు శాంతిభద్రతలకు సవాల్ విసురుతున్నాయన్నారు. ఆంగ్లేయుల నాటి చట్టాలను మార్చడం జరిగిందన్నారు. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు. క్రిఫ్టో కరెన్స్తీో దేశ ఆర్ధిక వ్యవస్థ బలహీనం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు తెచ్చామని, వాటి ఆధారంగా మరింత మెరుగ్గా మహిళలు సామాజిక, రాజకీయ, విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. ఈ బ్యాచ్‌లో ఇండియన్ ట్రైనీ ఐపీఎస్ లు 155, మరో 20 మంది ఫారిన్ ఆఫీసర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
102 వారాలు పాటు శిక్షణ పూర్తి చేయాల్సి ఉండగా అందులో ట్రైనీలు మొదటి దశ పూర్తి చేసుకున్నారు. 75 మంది ఉన్న ఐపీఎస్ బ్యాచ్ లో 34 మంది మహిళ ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారు. వారిలో 32 మంది ఇండియన్ ట్రైనీలు కాగా.. ఇద్దరు విదేశీయులు. తెలంగాణకు 9 మంది, ఏపీకి 5గురు ఐపీఎస్‌లను కేటాయించడం జరిగింది. తెలంగాణకు ముగ్గురు మహిళ ఐపీఎస్‌లు, ఏపీకి ఒక మహిళ ఐపీఎస్‌ను కేటాయించారు. 155 మందిలో 102 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వారు కావడం విశేషం. 25 ఏళ్ళ లోపు కలిగిన ట్రైనీ లు 9 మంది ఉన్నారు.