అంశాల స్వామి పోరాట యోధుడు.. KTR భావోద్వేగం

Amshala Swamy | ఫ్లోరోసిస్ ర‌క్క‌సిపై యుద్ధం చేసిన అంశాల స్వామి.. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ శ‌నివారం తెల్ల‌వారుజామున క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. స్వామి మృతిపై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అంశాల స్వామి ఎలా చనిపోయాడంటే..? అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు కేటీఆర్. అంశాల స్వామి ఫ్లోరోసిస్ బాధితుల త‌ర‌పున పోరాడిన పోరాట యోధుడు అని కేటీఆర్ కొనియాడారు. అత‌ను చాలా మందికి ప్రేర‌ణ అని పేర్కొన్నారు. స్వామి […]

అంశాల స్వామి పోరాట యోధుడు.. KTR భావోద్వేగం

Amshala Swamy | ఫ్లోరోసిస్ ర‌క్క‌సిపై యుద్ధం చేసిన అంశాల స్వామి.. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ శ‌నివారం తెల్ల‌వారుజామున క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. స్వామి మృతిపై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భావోద్వేగ ట్వీట్ చేశారు.

అంశాల స్వామి ఎలా చనిపోయాడంటే..?

అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు కేటీఆర్. అంశాల స్వామి ఫ్లోరోసిస్ బాధితుల త‌ర‌పున పోరాడిన పోరాట యోధుడు అని కేటీఆర్ కొనియాడారు. అత‌ను చాలా మందికి ప్రేర‌ణ అని పేర్కొన్నారు. స్వామి ఎల్ల‌ప్పుడూ త‌న హృద‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాడ‌ని కేటీఆర్ తెలిపారు. అత‌ని ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కేటీఆర్ ప్రార్థించారు. ఈ సంద‌ర్భంగా స్వామితో క‌లిసి భోజ‌నం చేసిన ఫోటోను కేటీఆర్ షేర్ చేశారు.

గ‌తేడాది స్వామి సొంతింటి క‌ల‌ను కేటీఆర్ నెర‌వేర్చారు. మునుగోడు ఉప ఎన్నిక స‌మ‌యంలో స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్.. వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని కేటీఆర్ భ‌రోసా క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే.