విధాత: ఎరక్కపోయి అడవి నుంచి బయటకు వచ్చిన ఏనుగు వ్యవసాయ బావిలో పడింది. అది గమనించిన సమీప రైతు గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు, రైతు కలిసి పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు వ్యవసాయ బావి వద్దకు వచ్చి జేసీబీ సహాయంతో బావి గోడను పగల గొట్టి ఏనుగును కాపాడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గాండ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అడవి నుంచి మేత కోసం బయటకు వచ్చిన ఏనుగు ప్రమాదవ శాత్తు గ్రామానికి సమీపంలో ఉన్నవ్యవపాయ బావిలో పడింది.