Fire Accident | హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. JP ఇండస్ట్రీస్‌లో ఎగిసిపడుతున్న అగ్నికీలలు..!
Fire Accident | హైదరాబాద్ నగర వాసులను అగ్ని ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరచిపోక ముందే నాచారం పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. కంపెనీ చుట్టుపక్కల పొగ వ్యాపించింది. దాంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలువురు అగ్నిమాపక సిబ్బందికి […]

Fire Accident | హైదరాబాద్ నగర వాసులను అగ్ని ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరచిపోక ముందే నాచారం పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.
కంపెనీ చుట్టుపక్కల పొగ వ్యాపించింది. దాంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలువురు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
భారీ మంటల కారణంగా పొగ కమ్ముకోవడంతో మంటలు ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరుస అగ్ని ప్రమాదాలతో ఆందోళన
వరుస అగ్ని ప్రమాదాలు నగర వాసులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాంప్లెక్స్‌లో ఏడు, ఎనిమిది అంతస్థుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అంతకు ముందు కూడా డెక్కన్ షో రూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారీ ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి మృతి చెందగా.. మంటల కారణంగా బిల్డింగ్ దెబ్బతినడంతో మొత్తం కూల్చివేశారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.