CM KCR | దివ్యాంగుల పెన్షన్ మరో వెయ్యి పెంపు: సీఎం కేసీఆర్
CM KCR | దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ 700 కోట్లు హృదయం ఉప్పొంగేలా 250 కిలోమీటర్ల గోదావరి నది మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ విధాత: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ అందుతున్నది. తాజా పెంపుతో అది ఇకపై రూ.4,016 కానున్నది. తెలంగాణ సమాజం బాగుండాలన్న కేసీఆర్.. ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్లతో బ్రహ్మాండంగా […]

CM KCR |
- దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ 700 కోట్లు
- హృదయం ఉప్పొంగేలా 250 కిలోమీటర్ల గోదావరి నది
- మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్
విధాత: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ అందుతున్నది. తాజా పెంపుతో అది ఇకపై రూ.4,016 కానున్నది. తెలంగాణ సమాజం బాగుండాలన్న కేసీఆర్.. ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్లతో బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పారు.
‘దివ్యాంగులకు రూ. 3,016 పెన్షన్ ఇస్తున్నాం. ఇవాళ మంచి దినం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో దివ్యాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం. మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి.. తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను ఈ రోజు దాకా సస్పెన్షన్‌లో పెట్టాను’ అని చెప్పారు.వచ్చే నెల నుంచి రూ.4,116 పెన్షన్ అందుతుందన్నారు.
అందరి సంక్షేమం కోరుతున్నాం
అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘సంక్షేమంలో బాగున్నాం. వ్యవసాయంలో బాగున్నాం. సింగరేణి సోదరులు కూడా చాలా మంది ఈ సభలో ఉంటారు. సింగరేణి 134 ఏండ్ల చరిత్ర ఉంది. వాస్తవానికి అది మన సొంత ఆస్తి. నిజాం కాలంలో ప్రారంభమైంది. వేల మందికి అన్నం పెట్టింది’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ తన హయాంలో సింగరేణిని సర్వనాశనం చేసింది. కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చింది. అప్పు తిరిగి చెల్లించక, మన సొంతదైన కంపెనీలో 49 శాతం వాటా కింద కేంద్ర ప్రభుత్వానికి అమ్మేసింది’ అని విమర్శించారు.
తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పింఛన్ రూ. 1000 పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం శ్రీ కేసీఆర్#తెలంగాణదశాబ్దిఉత్సవాలు pic.twitter.com/PL64Yd0Rzo
— BRS Party (@BRSparty) June 9, 2023
‘2014 కంటే ముందు కార్మికులకు ఇచ్చే బోనస్ 18 శాతం మాత్రమే. అంటే రూ.50 నుంచి 60 కోట్లు మాత్రమే కార్మికులకు పంచేది. తెలంగాణ వచ్చాక సింగరేణి నడక మారింది. 2014లో సింగరేణి టర్నోవర్ రూ. 11 వేల కోట్లు మాత్రమే. ఇవాళ అదే సింగరేణి టర్నోవర్‌ను రూ. 33 వేల కోట్లకు పెంచుకున్నాం. లాభాలు రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మాత్రమే ఉండే. ఇవాళ సింగరేణిలో ఈ ఏడాది వచ్చిన లాభాలు రూ. 2,184 కోట్లు.
వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ రూ. 700 కోట్లు’ అని సీఎం తెలిపారు. సింగరేణిలో నూతన నియామకాలు చేసుకుంటున్నామని, 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 6453 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరించి.. 19,463 ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.
సజీవమైన గోదావరి చూస్తుంటే హృదయం ఉప్పొంగింది..
250 కిలోమీటర్ల గోదావరి సస్యశ్యామలంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. సజీవమైన గోదావరిని చూస్తే తన హృదయం ఉప్పొంగిందని పేర్కొన్నారు. ‘సదాశివుడు అనే గొప్ప కవి ఉండే వారు. తలాపున పారుతుంది గోదారి.. మన చేను చెలక ఎడారి అని పాట రాశారు. ఇవాళ గోదావరి సజీవంగా ఉంది’ అని చెప్పారు.