Congress | ఉత్తమ్ వ్యతిరేక ట్రోలింగ్‌లో మరో మలుపు.. ‘చల్లమల’ ఫోన్ నుంచే వ్యతిరేక పోస్టులు

Congress | విధాత: పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యూత్ కాంగ్రెస్ (Congress) వార్ రూమ్ ఇన్చార్జి ప్రశాంత్ కుమార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సీసీఎస్ పోలీసుల ముందు ప్రశాంత్ సహా మరో ఇద్దరు వార్ రూమ్ ఉద్యోగులు హాజరయ్యారు. ఉత్తమ్ కు వ్యతిరేక పోస్టులు కమ్యూనికేషన్ పొరపాటు వల్ల జరిగిందంటూ విచారణలో ప్రశాంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల సమయంలో ఆ […]

Congress | ఉత్తమ్ వ్యతిరేక ట్రోలింగ్‌లో మరో మలుపు.. ‘చల్లమల’ ఫోన్ నుంచే వ్యతిరేక పోస్టులు

Congress |

విధాత: పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యూత్ కాంగ్రెస్ (Congress) వార్ రూమ్ ఇన్చార్జి ప్రశాంత్ కుమార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సీసీఎస్ పోలీసుల ముందు ప్రశాంత్ సహా మరో ఇద్దరు వార్ రూమ్ ఉద్యోగులు హాజరయ్యారు. ఉత్తమ్ కు వ్యతిరేక పోస్టులు కమ్యూనికేషన్ పొరపాటు వల్ల జరిగిందంటూ విచారణలో ప్రశాంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

మునుగోడు ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గం కాంగ్రెస్ నేత చల్లమల కృష్ణారెడ్డి కోసం పని చేశామని, చల్లమల కృష్ణా రెడ్డి ఫోన్ నుండే ఉత్తమ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లుగా ప్రశాంత్ చెప్పడంతో ఈ వివాదం లో మరో కొత్త విషయం వెలుగు చూసినట్లయ్యింది.

కాగా.. సొంత పార్టీ సోషల్ మీడియా వార్ రూమ్ నుండి ఉత్తమ్, జగ్గారెడ్డి, భట్టి లు ట్రోలింగ్ బారిన పడిన తీరు వివాదాస్పదమైంది. తమకు వ్యతిరేకంగా ట్రోలింగ్ వెనుక పార్టీలోని తమ ప్రత్యర్థుల ప్రమేయం ఉందా లేదా అన్న విషయాలు కూడా సిసిఎస్ విచారణలో తేలుతాయని వారు భావిస్తున్నారు.