‘కాంతార’ భూతకోల వేడుకలో.. ‘స్వీటీ’ అనుష్క సందడి

విధాత: కొన్ని కొన్ని చిత్రాలు క్లాసికల్‌గా నిలబడతాయి. వాటి వలన కొంత కాలం పాటు జనాలందరూ వాటి మేనియాలో పడిపోతారు. ఉదాహరణకు సంగీతం ప్రధాన అంశంగా తీసిన శంకరాభరణం, శృతిలయలు, స్వాతి కిరణం, సిరివెన్నెల వంటివి.. నాట్యపరంగా సాగర సంగమం, సప్తపది, సితార వంటివి. అదే సమయంలో జర్నలిజానికి ఊపిరిపోస్తూ తీసిన అంతిమ తీర్పు.. ఇలా చాలా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాడు ఈ పాన్ ఇండియా సినిమాలు.. సోషల్ మీడియా లేదు కాబట్టి వాటికి అంతర్జాతీయ స్థాయిలో […]

  • By: krs    latest    Dec 21, 2022 11:19 AM IST
‘కాంతార’ భూతకోల వేడుకలో.. ‘స్వీటీ’ అనుష్క సందడి

విధాత: కొన్ని కొన్ని చిత్రాలు క్లాసికల్‌గా నిలబడతాయి. వాటి వలన కొంత కాలం పాటు జనాలందరూ వాటి మేనియాలో పడిపోతారు. ఉదాహరణకు సంగీతం ప్రధాన అంశంగా తీసిన శంకరాభరణం, శృతిలయలు, స్వాతి కిరణం, సిరివెన్నెల వంటివి.. నాట్యపరంగా సాగర సంగమం, సప్తపది, సితార వంటివి. అదే సమయంలో జర్నలిజానికి ఊపిరిపోస్తూ తీసిన అంతిమ తీర్పు.. ఇలా చాలా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

నాడు ఈ పాన్ ఇండియా సినిమాలు.. సోషల్ మీడియా లేదు కాబట్టి వాటికి అంతర్జాతీయ స్థాయిలో అంత గుర్తింపు రాలేదేమో..! అయినా కూడా వాటిని విదేశీయులు ఎంతగానో మెచ్చుకున్నారంటే వాటి గొప్పతనమది. విదేశీయులు అడిగి మరీ ఆయా చిత్రాలను వేసుకొని చూసుకున్నారు. ఈ కోవకు చెందిన చిత్రమే కన్నడలో వచ్చిన ‘కాంతార’. తెలుగులో సూత్రధారులు చిత్రం మన సంక్రాంతి వేషగాళ్ల హరిదాసుల జీవితాన్ని చూపిస్తుంది. అలాగే కోలాటాలు, భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి వంటి క‌ళ‌ల‌పై కూడా ఆస‌క్తి క‌లిగించే చిత్రాలు వ‌స్తే చూడాల‌ని చాలామంది అభిలాష‌..!

‘కాంతార’ చిత్రం కన్నడ దేశంలో ప్రసిద్ధి చెందిన భూతకోల నృత్యాన్ని చూపిస్తుంది. దాని గొప్పతనాన్ని మనకు వివరిస్తుంది. అతి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా కొన్ని వందల కోట్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని సాంప్రదాయా నృత్యాన్ని నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అత్యద్భుతంగా చూపించాడు. ఈ సినిమా విడుదలైన తర్వాతే దేశవ్యాప్తంగా ఈ భూతకోలా నృత్యానికి మంచి ఆదరణ లభించింది. తాజాగా మన స్వీటీ అదేనండి అనుష్క శెట్టి మంగుళూరులో జరిగిన భూత కోలా వేడుకల్లో తన కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని సందడి చేసింది.