Anushka Sharma | తప్పదు మరి ! అనుష్క శర్మను బైక్‌పై ఎక్కించుకున్న బాడీ గార్డు.. ట్రాఫిక్‌లో చిక్కుకుని
విధాత: ఒక్కోసారి మనం చేసే పని మనకు తెలియకుండానే మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. ఆ విషయం ఒక్కోసారి మనకు చాలా సమయం వరకు తెలియదు కూడా! బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)కు కూడా అలాంటి ఇబ్బందే ఎదురైంది. అనుష్క శర్మ బాడీగార్డ్ చేసిన పనిని దారిన పోయే వారు, ఎప్పుడూ తారలను వెంటాడుతుండే పాపరాజ్జీలు సెల్‌ఫోన్‌లలో బంధించారు. అవి కాస్తా నెట్‌కు ఎక్కడంతో వివాదం రేగింది. View this post on […]

విధాత: ఒక్కోసారి మనం చేసే పని మనకు తెలియకుండానే మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. ఆ విషయం ఒక్కోసారి మనకు చాలా సమయం వరకు తెలియదు కూడా! బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)కు కూడా అలాంటి ఇబ్బందే ఎదురైంది.
అనుష్క శర్మ బాడీగార్డ్ చేసిన పనిని దారిన పోయే వారు, ఎప్పుడూ తారలను వెంటాడుతుండే పాపరాజ్జీలు సెల్‌ఫోన్‌లలో బంధించారు. అవి కాస్తా నెట్‌కు ఎక్కడంతో వివాదం రేగింది.
View this post on Instagram
షూటింగ్‌లతో బిజీగా ఉండే అనుష్క శర్మ.. ఇటీవల ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దాంతో కారు వదిలి బైక్ మీద తాను వెళ్లాల్సిన చోటుకు బయల్దేరారు. అంతే.. నిత్యం సినీ తారలను వెంటాడే వారికి చేతినిండా పని దొరికినట్టయింది. దీంతో తన బాడీగార్డ్ అయిన బైక్ డ్రైవర్‌ను స్పీడ్‌గా బండి తోలమని చెప్పింది. దాంతో బాడీ గార్డు వేగంగా బైక్‌ను ముందుకు దూకించాడు.
కట్ చేస్తే ఈ వీడియోలు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో అనుష్క శర్మ, ఆమె బాడీగార్డు హెల్మెట్లు ధరించి లేరు. ఆ వీడియోలను కొందరు సిటీ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశారు. పోలీసులు కూడా వెంటనే రియాక్టయి.. ఆమె బాడీగార్డుకు పదివేల రూపాయల ఫైన్ వేశారు. దీనిని ముంబై ట్రాఫిక్ పోలీసులు ధ్రువీకరించారు. జరిమానా కట్టేశారని తెలిపారు