విధాత : జనసేన మా మిత్రపక్షమని ఏపీ బీజేపీ తీర్మానం చేసింది. బుధవారం విజయవాడ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలకమైన 11అంశాలపై తీర్మానాలు చేశారు. వాటిల్లో ప్రధానంగా జనసేన మా మిత్రపక్షమని తేల్చి చెప్పింది.
అదే సమయంలో టిడిపి తో పొత్తు అంశాన్ని రాజకీయ తీర్మానంలో ప్రస్తావించకుండా పార్టీ హై కమాండ్ కు వదిలేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని.. ఓట్లు, సీట్లు పెంచుకునే దిశగా అడుగులు వేయాలని సమావేశ కేడర్ కు పిలుపు నిచ్చింది