AP Capital | మూడు రాజధానులతో.. మూడు ప్రాంతాల్లో సెగ
AP Capital విధాత: ఏపీ రాజధాని అమరావతేనని నాటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ తేల్చి చెప్పారు. ఆ పార్టీ నాయకులు కూడా అమరావతే రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ స్వరం పూర్తిగా మారిపోయింది. కొత్తగా మూడు రాజధానులంటూ వింత ప్రతిపాదన తీసుకువచ్చారు. రాష్ట్ర పరిపాలన విశాఖ నుంచి కొనసాగుతుందని, జుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు ఉంటుందని చెప్పిన జగన్ ప్రభుత్వం.. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా పరిమితమవుతుందని ప్రకటించింది. ఇది మూడు […]

AP Capital
విధాత: ఏపీ రాజధాని అమరావతేనని నాటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ తేల్చి చెప్పారు. ఆ పార్టీ నాయకులు కూడా అమరావతే రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ స్వరం పూర్తిగా మారిపోయింది. కొత్తగా మూడు రాజధానులంటూ వింత ప్రతిపాదన తీసుకువచ్చారు.
రాష్ట్ర పరిపాలన విశాఖ నుంచి కొనసాగుతుందని, జుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు ఉంటుందని చెప్పిన జగన్ ప్రభుత్వం.. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా పరిమితమవుతుందని ప్రకటించింది. ఇది మూడు ప్రాంతాల్లోనూ వ్యతిరేకతను ఎదుర్కొన్నది. విశాఖ వంటి నగరం రాజధాని స్థాయి ఒత్తిడిని తట్టుకోలేదని నిపుణులు అభిప్రాయ పడ్డారు.
మరోవైపు ప్రభుత్వాధికారులు నిత్యం వివిధ కేసుల విషయంలో కోర్టులకు హాజరుకావాల్సి ఉంటుంది. జగన్ చెబుతున్న మూడు రాజధానుల ప్రకారం కేసులకు హాజరు కావాలంటే.. విశాఖ నుంచి కర్నూలుకు వెళ్లాలి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. జగన్ చెబుతున్న మూడు రాజధానుల సిద్ధాంతంలో అసెంబ్లీ జరిగిన ప్రతిసారి ఉన్నతాధికారులు అమరావతిలో ఉండాల్సి వస్తుంది.
ఈ రెండు సందర్భాల్లోనూ కీలకమైన అనేక విధులు స్తంభించి పోయే అవకాశం ఉన్నదని, పైగా విధి నిర్వహణలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉన్నదని పలువురు రాజకీయ నిపుణులు హెచ్చరించినా జగన్ మాత్రం మొండిగా విశాఖకే జై కొడుతున్నారు. ఇది సచివాలయ ఉద్యోగుల్లోనూ, ఉన్నతాధికారుల్లోనూ తీవ్ర అసంతృప్తిని రాజేస్తున్నది.