విధాత: తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై చర్చకు సిద్ధమా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. నిన్న తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర రైతు సంఘం నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నాకు చేరాయన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు ఎన్‌సీఆర్‌బీ రికార్డుల్లో ఉన్నాయని.. అందులో లెక్కల్లోకి ఎక్కని బలవన్మరణాలు ఇంతకు పదింతలు పెరిగాయన్నారు. రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో చర్చకు సిద్ధమన్న పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవన్న మీ మాటల్లో నిజం ఎంతో నిగ్గు తేలుస్తామన్నారు.