Army Helicopter: ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
విధాత : అహ్మదాబాద్ బోయింగ్ విమాన ప్రమాదం నేపథ్యంలో విమానయాన ప్రమాదాలు చర్చనీయాంశమయ్యాయి. ఇదే క్రమంలో పంజాబ్ పఠాన్‌కోట్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్ సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ చేయడం కలకలం రేపింది. వాయుసేన అటాక్ హెలికాప్టర్ అపాచీ నంగాల్ పూర్ సమీపంలోని హాలెడ్ గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయితే.. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వైమానిక దళ అధికారులు, సాంకేతిక నిపుణులు ఘటన స్థలికి చేరుకుని హెలికాప్టర్ ను పరిశీలిస్తున్నారు. ప్రపంచంలోనే అటాక్ హెలికాప్టర్ రంగంతో అపాచీ ఉత్తమమైందిగా గుర్తింపు పొందింది. ఎగిరే యుద్ద ట్యాంకులుగా వాటికి పేరుంది. ఈ హెలికాప్టర్ లను భారత్ అమెరికా నుంచి రూ.13,952కోట్ల డీల్ ద్వారా కొనుగోలు చేసింది.
భారత వాయుసేన విమానాలు, హెలికాప్టర్లు అప్పుడప్పుడు అత్యవసర ల్యాండింగ్ లకు గురువుతున్నాయి. ఏప్రిల్ లో మధ్యప్రదేశ్ లోని బింద్ వద్ద హెలికాప్టర్ లో సాంకేతిక లోపంతో పైలట్లు పొలాల్లో అత్యవరసంగా ల్యాండు చేశారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత వాయుసేన ఖచ్చితమైన దాడులతో విజయాలు అందుకున్నప్పటికి రాఫెల్ యుద్ద విమానం నష్టపోవడంతో వాయుసేన సమర్ధత..సన్నద్దతలను ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram