అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..!

ఉన్న‌మాట‌: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగవు అని పలుమార్లు లోక్‌స‌భలో కేంద్రం స్పష్టం చేసిన మళ్ళీ ఆ ప్రస్తావన వస్తూనే ఉంది. మళ్ళీ జనగణన, రిజర్వేషన్ల కేటాయింపు వంటి అంశాలు చేపడితేనే కానీ సీట్లు పెరగవు అని కేంద్రం ఇది వరకే చెప్పింది. 2024 ఎన్నికల్లోపు ఈ సీట్లు పెరగవు అని 2029 నాటికి సాధ్యం అవుద్దేమో అని కేంద్రం గతంలోనే చెప్పినా మళ్ళీ ఈ పాయింట్ ను లెవనెత్తుతుంటారు.రాష్ట్ర విభజన చట్టం ప్రకారం […]

అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..!

ఉన్న‌మాట‌: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగవు అని పలుమార్లు లోక్‌స‌భలో కేంద్రం స్పష్టం చేసిన మళ్ళీ ఆ ప్రస్తావన వస్తూనే ఉంది. మళ్ళీ జనగణన, రిజర్వేషన్ల కేటాయింపు వంటి అంశాలు చేపడితేనే కానీ సీట్లు పెరగవు అని కేంద్రం ఇది వరకే చెప్పింది.

2024 ఎన్నికల్లోపు ఈ సీట్లు పెరగవు అని 2029 నాటికి సాధ్యం అవుద్దేమో అని కేంద్రం గతంలోనే చెప్పినా మళ్ళీ ఈ పాయింట్ ను లెవనెత్తుతుంటారు.రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న 175 సీట్లను 225 కు, తెలంగాణాలో ఉన్న 119 సీట్లకు 153 సీట్లకు పెంచాలి.

అయితే దీని మీద కేంద్రం ఇన్నేళ్ళుగా నిర్ణయం తీసుకోలేదు. ఇదే తరుణంలో మొన్ననే పోయిర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడిన జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పునర్విభజన చేసేందుకు చర్యలు మొదలయ్యాయి.

అయితే దీని మీద సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ పురుషొత్తం రెడ్డి సుప్రీం కోర్టులో కేసు వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్రం, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచడం లేదు అన్నది పిటిషన్‌లో పేర్కొన్నారు. అంటే 2031 నాటి జనాభ లెక్కల ప్రకారం సీట్ల పెంపు ఉంటుందని. మరి అదే నిబంధనలు జమ్మూ కాశ్మీర్‌కి ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నిస్తున్నారు.

చేస్తే అందరికీ 2031 నాటి జనాభా లెక్కలనే తీసుకుని చేయాలి. కానీ అక్కడ అలా ఇక్కడ ఇలా చేయడం తగునా అన్నదే చర్చ. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీకి 2023 చివరలో ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు అయితే 2024 మేలో ఎన్నికలు జరుగుతాయి.