అచ్చన్నకు.. అధినేతను కలిసే ఛాన్స్ వచ్చిందోచ్

  • Publish Date - September 25, 2023 / 12:45 PM IST

విధాత‌: మొత్తానికి తమ అధినేత అరెస్ట్ అయిన ఇన్నాళ్లకు టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి చంద్రబాబును కలిసేందుకు అవకాశం కలిగింది. ఇప్పటివరకు లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి తరువాత బాలయ్య, పవన్, ఇంకా యనమల రామకృష్ణుడు మాత్రమే చంద్రబాబును జైల్లో ములాఖత్ ద్వారా కలిశారు.


నిన్నటితో పూర్తయిన చంద్రబాబు రిమాండ్ అక్టోబర్ ఐదు వరకూ పొడిగించారు. ఇక పార్టీ వరకూ చూస్తే అచ్చెన్న సైతం ముఖ్యుడే.. చంద్రబాబు అందుబాటులో లేనపుడు పార్టీని నడపాల్సింది కూడా ఆయనే.. అయితే అయన మాత్రం మొదటి విడతలో అధినేతను కలిసే ఛాన్స్ దక్కించుకోలేకపోయారు.


మొత్తానికి ఇప్పటికి.. అంటే ఈరోజు భువనేశ్వరి, బ్రహ్మణి తో కలిసి అచ్చెన్న సైతం జైల్లో అధినేతను కలిశారు. తాను లేకుండానే లోకేష్, బాలయ్య. పవన్ ఈ ముగ్గురూ కలిసి టిడిపి జనసేన పొత్తు ప్రకటన చేయడంతో అచ్చెన్న హార్ట్ అయ్యారని అంటారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అయిన నేను లేకుండా పొత్తుల ప్రకటనా ? ఇదేనా నాకు మీరిచ్చే గౌరవం అని అయన అలకవహించారని అంటున్నారు.


దీంతోబాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తనను కాదని యనమలకు ఛాన్స్ ఇచ్చి జైలుకు పిలిపించుకుని మాట్లాడిన అంశం కూడా అచ్చెన్నను హర్ట్ చేసిందని అంటున్నారు. దీంతో ఈరోజు అచ్చెన్న జైల్లో చంద్రబాబును కలుస్తున్నారు.


మరోవైపు పార్టీకి 14 మందితో ఒక కార్యాచరణ కమిటీని వేశారు. చంద్రబాబు బెయిల్ మీద వచ్చేవరకూ ఆ కమిటీ మొత్తం పార్టీని నడిపిస్తుంది. ఇప్పుడు ఆ కమిటీకి సారధ్యం వహించేది కూడా అచ్చెన్నే.. ఈ అంశాలన్నీ చంద్రబాబు ఆయనకు దిశానిర్దేశం చేసారని అంటున్నారు.