TRS ఆత్మీయ సమ్మేళనం.. అట్ట ముక్కలపై భోజనం!
విధాత: మునుగోడు ఉప ఎన్నిక వేళ అన్ని పార్టీలు సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఆయా కులాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో యాదవ - కుర్మల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రుల హరీశ్‌రావు, తలసాని, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గొల్ల కురుమలు ధర్మం […]

విధాత: మునుగోడు ఉప ఎన్నిక వేళ అన్ని పార్టీలు సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఆయా కులాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో యాదవ – కుర్మల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రుల హరీశ్‌రావు, తలసాని, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గొల్ల కురుమలు ధర్మం వైపు నిలబడుతారు, నిజాయితీగా ఉంటారు అని పొగిడారు.
TRS ఆత్మీయ సమ్మేళనం.. అట్ట ముక్కలపై భోజనం! https://t.co/ZMTZwKxyEa pic.twitter.com/kfeG1dcKST
— vidhaathanews (@vidhaathanews) October 26, 2022
ఇంతవరకు బాగానే ఉన్నది. సమ్మేళనం అనంతరం అక్కడికి వచ్చిన గొల్ల కురుమలకు భోజన ఏర్పాట్లు చేశారు. కానీ ప్లేట్లు అయిపోయానే కారణంతో ప్యాకింగ్ అట్ట ముక్కలపై కొంతమందికి భోజనం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అయ్యింది.
దీనిపై నెటీజన్లు మండి పడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి పిలిచి ఇలా అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిర్వాహకుల తెలిసి జరిగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. గొల్ల కురుమ నిజాయితీ కి టీఆరెఎస్ వాళ్ళు ఇస్తున్న బహుమతి ఇదేనా? అని నిలదీస్తున్నారు.