రాజగోపాల్ పై చెప్పుతో దాడికి యత్నం
విధాత: మునుగోడు రణగోడులా మారింది. ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీకి ప్రజామోదం ఉండబోతున్నదన్న ఉత్కంఠ అందరిలోనూ ఉన్నది. పార్టీల నుంచి నేతలు చేజారుతుండటం, నియోజకవర్గంలో ప్రధాన పార్టీల స్థానికేతర నేతలు మకాం వేసి ప్రచారంలో ఉండటంతో మునుగోడు ఓటర్ల మనోగతం ఏమిటీ అన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. కొన్నిచోట్ల బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, కొన్నిచోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. పార్టీ మారిన […]

విధాత: మునుగోడు రణగోడులా మారింది. ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీకి ప్రజామోదం ఉండబోతున్నదన్న ఉత్కంఠ అందరిలోనూ ఉన్నది. పార్టీల నుంచి నేతలు చేజారుతుండటం, నియోజకవర్గంలో ప్రధాన పార్టీల స్థానికేతర నేతలు మకాం వేసి ప్రచారంలో ఉండటంతో మునుగోడు ఓటర్ల మనోగతం ఏమిటీ అన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
కొన్నిచోట్ల బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, కొన్నిచోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటుగా మరికొన్ని చోట్ల మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంట్రాక్టుల కోసం తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ టీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలు ఆయన ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.
నిన్న నల్గొండ జిల్లా నేలపట్లలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జై కేసారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అతి దగ్గరగా గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఆయన ప్రసంగాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.. అప్రమత్తమైన రాజగోపాల్ రెడ్డి అక్కడి నంచి వెళ్లి పోయారు.
నల్గొండ జిల్లా లింగోటంలోను కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి.
రాజగోపాల్ పై చెప్పుతో దాడికి యత్నం https://t.co/E61IHAsSA8 pic.twitter.com/ksioXxXTJ4
— vidhaathanews (@vidhaathanews) October 24, 2022