Twitter | త్వరలో.. ట్విటర్ నుంచి ఆడియో, వీడియో కాల్స్
విధాత: ట్విటర్ (Twitter) యూజర్లకు ఎలాన్ మస్క్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే ట్విటర్లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు చెప్పారు. 'ఇక మీ హ్యాండిల్ ద్వారా ట్విటర్‌లో ఉన్న ఎవరికైనా ఫోన్ నంబర్ ఇవ్వకుండానే మాట్లాడొచ్చు' అని మస్క్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వాట్సప్‌పై మస్క్ విమర్శలు గుప్పించారు. మెటాకు చెందిన వాట్సప్ అంత నమ్మదగినది కాదని వాఖ్యానించారు. బుధవారం నుంచి ప్రతి ట్వీట్ ఎన్ క్రిప్ట్ అవుతుందని, ఇక నుంచి ప్రైవసీకి అత్యంత […]

విధాత: ట్విటర్ (Twitter) యూజర్లకు ఎలాన్ మస్క్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే ట్విటర్లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు చెప్పారు. ‘ఇక మీ హ్యాండిల్ ద్వారా ట్విటర్‌లో ఉన్న ఎవరికైనా ఫోన్ నంబర్ ఇవ్వకుండానే మాట్లాడొచ్చు’ అని మస్క్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వాట్సప్‌పై మస్క్ విమర్శలు గుప్పించారు.
మెటాకు చెందిన వాట్సప్ అంత నమ్మదగినది కాదని వాఖ్యానించారు. బుధవారం నుంచి ప్రతి ట్వీట్ ఎన్ క్రిప్ట్ అవుతుందని, ఇక నుంచి ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నామని తెలిపారు. కాగా పేమెంట్లు, మెసేజ్‌లు ఇలా అన్ని పనులకూ ఉపయోగపడే ఒక సూపర్ యాప్‌ను రూపొందిస్తానని మస్క్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.