Auto | భారీగా ట్రాఫిక్ జామ్‌.. ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిపై నుంచి దూసుకెళ్లిన ఆటో..

Auto | ఢిల్లీ, బెంగ‌ళూరు, ముంబై, కోల్‌క‌తా, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ న‌గ‌రాల్లో ప్ర‌తి రోజు ఏదో ఒక చోట ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డుతూనే ఉంటుంది. గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాం. ఇలాంటి స‌మ‌యంలో ద్విచ‌క్ర వాహ‌న‌దారులు.. సుల‌భంగా ముందుకు వెళ్తుంటారు. కానీ ఆటోలు, కార్లు, బ‌స్సులు అంత ఈజీగా ముందుకు క‌ద‌ల్లేవు. నెమ్మ‌దిగా ముందుకు క‌దులుతుంటాయి. ఈ ట్రాఫిక్ క‌ష్టాల నుంచి త‌ప్పించుకునేందుకు ఓ […]

  • By: raj    latest    Sep 04, 2023 10:45 AM IST
Auto | భారీగా ట్రాఫిక్ జామ్‌.. ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిపై నుంచి దూసుకెళ్లిన ఆటో..

Auto |

ఢిల్లీ, బెంగ‌ళూరు, ముంబై, కోల్‌క‌తా, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ న‌గ‌రాల్లో ప్ర‌తి రోజు ఏదో ఒక చోట ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డుతూనే ఉంటుంది. గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాం.

ఇలాంటి స‌మ‌యంలో ద్విచ‌క్ర వాహ‌న‌దారులు.. సుల‌భంగా ముందుకు వెళ్తుంటారు. కానీ ఆటోలు, కార్లు, బ‌స్సులు అంత ఈజీగా ముందుకు క‌ద‌ల్లేవు. నెమ్మ‌దిగా ముందుకు క‌దులుతుంటాయి. ఈ ట్రాఫిక్ క‌ష్టాల నుంచి త‌ప్పించుకునేందుకు ఓ ఆటో డ్రైవ‌ర్ పెద్ద సాహ‌స‌మే చేశాడు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఓ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్ప‌డింది. ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో తీవ్ర అస‌హ‌నంతో ఉన్న ఓ ఆటో డ్రైవ‌ర్‌.. త‌న ఆటోను ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జి మీద‌కు ఎక్కించేశాడు. త‌న ఆటోను ఆప‌కుండా వేగంగా ముందుకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఈ ఘ‌ట‌న‌పై ట్రాఫిక్ పోలీసులు సీరియ‌స్‌గా స్పందించారు. ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిపైకి ఎక్కించిన ఆటోను పోలీసులు గుర్తించారు. ఆటోడ్రైవ‌ర్ మున్నా(25)ను అరెస్టు చేశారు. ఆటోను సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఢిల్లీ పోలీసులు హెచ్చ‌రించారు.