Autonagar | తెగిపడిన L T విద్యుత్‌ తీగ.. కాలిపోయిన గృహోపకరణాలు! తప్పిన పెను ప్రమాదం

Autonagar | విధాత, మెదక్ బ్యూరో: L T విద్యుత్ వైరు తెగి పట్టణానికి విద్యుత్ సరఫరా అయ్యే వైరుపై పడి తీవ్ర మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల ఇళ్లలో మీటర్లు, గృహో పకరణాలు, మీటర్లు, ఫ్యాన్లు, టివీలు కాలి పోయిన ఘటన మెదక్ జిల్లా ఆటోనగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగి పడి పట్టణానికి […]

  • Publish Date - May 26, 2023 / 07:25 AM IST

Autonagar |

విధాత, మెదక్ బ్యూరో: L T విద్యుత్ వైరు తెగి పట్టణానికి విద్యుత్ సరఫరా అయ్యే వైరుపై పడి తీవ్ర మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల ఇళ్లలో మీటర్లు, గృహో పకరణాలు, మీటర్లు, ఫ్యాన్లు, టివీలు కాలి పోయిన ఘటన మెదక్ జిల్లా ఆటోనగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగి పడి పట్టణానికి విద్యుత్ సఫరా చేసే వైరుపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు రేగాయి. అదే సమయంలో ఇళ్లలోని విద్యుత్‌ గృహోపకరణాలు, మీటర్లు,టీవీలు..స్వీచ్ బోర్డులు కాలిపోయాయి.

రాత్రి కారణంగా ఎవరూ రోడ్డుపై లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తీగలను సరి చేశారు. తెగి పోయిన విద్యుత్‌ వైర్లను మార్చి
సరఫరాను పునరుద్ధరించారు.

ఏడి వివరణ..

20 విద్యుత్ మీటర్లు సంబంధించి ఆటోనగర్ కాలిపోయాయని ప్రాధమిక సమాచారం అందిందని ఏఈతో విచారణ జరిపి మీటర్లు అందిస్తామని విద్యుత్ శాఖ ఏడి మోహన్ బాబు తెలిపారు. ప్రమాదవశాత్తు వైరు తెగి పోయిందని, వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు.