చంద్రబాబు అలా.. పూరి ఇలా.. పిల్లల్ని కనాలా? వద్దా?

విధాత: పూరి జగన్నాథ్ తీసే చిత్రాలు హిట్ ఫ్లాప్‌లకు సంబంధం లేకుండా కొంతమందిని మాత్రం విపరీతంగా ఆట్టుకుంటాయి. ఆయన రాసే డైలాగులు, ఆయన హీరోలకు ఉండే యాటిట్యూడ్, వారు ప్రవర్తించే విధానం అన్ని సరికొత్త పంధాలో ఉంటాయి. అయితే ఇటీవల ఆయన ‘లైగర్’ చిత్రంతో పాన్ ఇండియా చిత్రం తీయాలని భావించి బొక్క బోర్లాపడ్డాడు. మరోవైపు సినిమా అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ తన పూరి మ్యూజింగ్స్‌ ద్వారా మాత్రం ఆయన పలు విషయాలను ప్రస్తావిస్తూ […]

  • By: krs    latest    Dec 29, 2022 5:06 AM IST
చంద్రబాబు అలా.. పూరి ఇలా.. పిల్లల్ని కనాలా? వద్దా?

విధాత: పూరి జగన్నాథ్ తీసే చిత్రాలు హిట్ ఫ్లాప్‌లకు సంబంధం లేకుండా కొంతమందిని మాత్రం విపరీతంగా ఆట్టుకుంటాయి. ఆయన రాసే డైలాగులు, ఆయన హీరోలకు ఉండే యాటిట్యూడ్, వారు ప్రవర్తించే విధానం అన్ని సరికొత్త పంధాలో ఉంటాయి. అయితే ఇటీవల ఆయన ‘లైగర్’ చిత్రంతో పాన్ ఇండియా చిత్రం తీయాలని భావించి బొక్క బోర్లాపడ్డాడు.

మరోవైపు సినిమా అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ తన పూరి మ్యూజింగ్స్‌ ద్వారా మాత్రం ఆయన పలు విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన వీటి ద్వారా పలు సామాజిక సమస్యలను, వాటి పరిష్కారాలను చెబుతూ వచ్చాడు. తాజాగా ఆయన జనాభా నియంత్రణ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

మనిషి పుట్టి ఇప్పటికే రెండు లక్షల సంవత్సరాలైంది. మానవ జాతి పెరుగుతూ వచ్చి ఎనిమిది బిలియన్లు దాటింది. రోజూ నాలుగు లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. బర్త్ రేట్ తో పోల్చుకుంటే డెత్‌ రేట్ సమానంగా లేదు. చావులు తక్కువ.. పుట్టుకలు ఎక్కువై పోయాయి. దీనివల్ల సగం ప్రకృతి నాశనం అయిపోయింది.

అడవులను నరికి మరి నివాస భూములుగా మార్చుకుంటున్నాం. మన తిండి కోసం ఏటా 80 బిలియ‌న్ల జంతువుల‌ను చంపుతున్నాం. దీనికి కోళ్లను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో చెప్పనలవి కాదు. 1970 తర్వాత 60% జంతువులు అంతరించిపోయాయి. మనం వీటిని బతకనీయడం లేదు. మనం మన పిల్లల్ని పుట్టించడంలో బిజీగా ఉన్నాం.

ఇక జనాభా పెరుగుదల ఆపాల్సిన సమయం వచ్చింది. ఈ భూమిని కాపాడాలంటే మానవజాతి అంతరించిపోవాలి. అదొక్కటే సమాధానం. అలాగని మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన పనిలేదు. పెళ్లిళ్లు చేసుకోవడం మానివేయాలి. పెళ్లి చేసుకున్నా.. పిల్లలను కనడం మానేయాలి. నా పిల్లలు, నా వంశము అనే ఆలోచన నుంచి బయట పడాలి.. మనమే సొంతంగా జనాభాని, మన వంశాన్ని నిలువరించాలి.

పిల్లల్ని కనడం ఆపకపోతే కొన్నాళ్లకు ఈ భూమి మ‌నుషుల‌తో నిండిపోతుంది. వేరే జంతువులు, పక్షులు, చెట్లు ఉండవు. ఈమధ్య చాలామంది ఆడవాళ్లు తమ అండాల‌ను భద్రపరుచుకోవడం మొదలుపెట్టారు. అసలు వాటిని ఎందుకు దాచుకోవాలి? భవిష్యత్తులో పిల్లల కోసమా? మన సరదా కోసం పిల్లల్ని క‌నేసి కొన్నాళ్లకు చనిపోతాము.. అని చెప్పుకొచ్చాడు.

కానీ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మాట్లాడుతూ ఒక్క సంతానంతో ఆగవద్దు కనీసం ఇద్దరు పిల్లల్ని పుట్టించండి అని అన్నాడు. నాడు సీనియ‌ర్ ఎన్టీఆర్ ఇందిరాగాంధీ, సంజ‌య్ గాంధిల కుటుంబ నియంత్ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఓ చిత్రం తీశాడు. మరి ఈ విషయంలో పూరి వ్యాఖ్యలు, ఎన్టీఆర్ అభిప్రాయం, నారా చంద్రబాబు వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏది నిజం? ఏది వాస్తవం.. అని ఆలోచిస్తే పూరీ చెప్పిందే నిజమని అర్థమవుతోంది.