Balagam | అందరిలోనూ ‘బలగం జపం’.. ఫొటోలకు టైటిల్‌తో ప్రచారం..!
Balagam | విధాత: తెలంగాణ పల్లె జీవనం, కుటుంబ సంస్కృతులకు అద్దం పడుతూ చిత్రీకరించిన బలగం సినిమా.. చూసిన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు ప్రజల మనసులను చూరగొని అనూహ్య విజయం సాధించింది. పల్లెల్లోనైతే ఏకంగా ఊరు ఊరంతా ఒక చోట చేరి బలగం సినిమా ప్రదర్శన తిలకిస్తూ, సినిమా కథను తమ కుటుంబాల్లోని కథగా భావిస్తూ చెమ్మగిల్లి నా కళ్లతో సినిమా చూసి ఆదరిస్తున్నారు. టైటిల్ వాడేసుకుంటున్న నాయకులు.. ఇంకోవైపు సినిమాకు వచ్చిన […]

Balagam |
విధాత: తెలంగాణ పల్లె జీవనం, కుటుంబ సంస్కృతులకు అద్దం పడుతూ చిత్రీకరించిన బలగం సినిమా.. చూసిన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు ప్రజల మనసులను చూరగొని అనూహ్య విజయం సాధించింది.
పల్లెల్లోనైతే ఏకంగా ఊరు ఊరంతా ఒక చోట చేరి బలగం సినిమా ప్రదర్శన తిలకిస్తూ, సినిమా కథను తమ కుటుంబాల్లోని కథగా భావిస్తూ చెమ్మగిల్లి నా కళ్లతో సినిమా చూసి ఆదరిస్తున్నారు.
టైటిల్ వాడేసుకుంటున్న నాయకులు..
ఇంకోవైపు సినిమాకు వచ్చిన ప్రజాదరణతో నాయకులు ఆ సినిమా టైటిల్ ను తమ ప్రసంగాల్లో ఫోటోలలో విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకొని చోటామోటా నాయకులు వరకు తమ ప్రసంగాల్లో కార్యకర్తలే నా బలం ప్రజలే మా బలగం అంటూ ఉపన్యాసాలు దంచేస్తున్నారు.
కొందరైతే తమ ఫోటోలకు బలగం సినిమా టైటిల్ పెట్టి కార్యకర్తలే నా బలం.. ప్రజలే నా బలగం అంటూ వాట్సప్ చిత్రాలను షేర్ చేసుకోవడంలో పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఫోటోలతో పాటు బలగం టైటిల్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, గల్లీ లీడర్ల ఫోటోలతో కూడా ప్రచారం కొనసాగుతుంది.
మొత్తం మీద తెలంగాణ గ్రామీణ సామాజిక జీవన సంస్కృతుల నేపథ్యంలో వచ్చి హిట్ కొట్టిన బలగం సినిమా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల్లోనూ వారి అవసరాలకు తగ్గట్లుగా బలగం టైటిల్ వినియోగంతో ప్రచారంలో దూసుక పోతుండటం విశేషం .