BiggBoss7: నాగార్జున స్థానంలో బాలకృష్ణ.. ఇక దబిడి దిబిడే..?
విధాత: టాక్ షోలకు బాలయ్య సూట్ కాడని, ఆయన అనర్గళంగా మాట్లాడలేక ఏవేవో మాట్లాడుతాడని ఒక అపవాదు ఉండేది. కానీ దాన్ని ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK S1, NBK S2లు తప్పని నిరూపించాయి. తెలుగు అగ్ర హీరోల్లో ఎవరికి తగ్గని రీతిలో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే.. అందరికంటే ఒక మెట్టు పైన బాలయ్య ఈ షోని హోస్ట్ చేస్తూ, ఆహాకి తిరుగులేని ఆధిపత్యం కట్ట పెట్టాడు. దాంతో విమర్శకుల నోళ్లు మూయించినట్టయింది. […]

విధాత: టాక్ షోలకు బాలయ్య సూట్ కాడని, ఆయన అనర్గళంగా మాట్లాడలేక ఏవేవో మాట్లాడుతాడని ఒక అపవాదు ఉండేది. కానీ దాన్ని ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK S1, NBK S2లు తప్పని నిరూపించాయి. తెలుగు అగ్ర హీరోల్లో ఎవరికి తగ్గని రీతిలో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే.. అందరికంటే ఒక మెట్టు పైన బాలయ్య ఈ షోని హోస్ట్ చేస్తూ, ఆహాకి తిరుగులేని ఆధిపత్యం కట్ట పెట్టాడు. దాంతో విమర్శకుల నోళ్లు మూయించినట్టయింది.
తాజాగా నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో శుభవార్త అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్ 7 ని స్టార్ మా యాజమాన్యం బాలయ్య చేతిలో పెట్టిందని సమాచారం. రెమ్యూనరేషన్ 10 కోట్లు ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇది అత్యధిక రెమ్యూనరేషన్.
ఇక తెలుగు బిగ్ బాస్‌కి ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడో విదేశాలలో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ షో హిందీలో, తమిళ్, తెలుగు ఇలా అన్ని భాషల్లోనూ కొనసాగుతోంది.
తెలుగులో 2017లో ఈ షో స్టార్ట్ చేశారు. మొదటి సీజన్‌ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, ఆ తర్వాత హీరో నాని ఒక సీజన్ హోస్ట్ చేయగా.. మిగతావన్నీ నాగార్జునే హోస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఈ బిగ్ బాస్ తెలుగు షో ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ఇక వచ్చే ఏడాది బిగ్ బాస్ 7 వీక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సీజన్ కు సంబంధించిన ఒక హాట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది.
అదేమిటంటే నాగార్జున బిగ్ బాస్ 7కు హోస్ట్‌గా ఉండడం లేదు. ఆయన ఆ హోస్టు స్థానం నుంచి తప్పుకుంటున్నాడు. ఇక ఆయన స్థానంలో మరో స్టార్ హీరో హోస్ట్ చేసే అవకాశం ఉంది అని. అన్‌స్టాపబుల్ విత్ NBK షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన బాలకృష్ణ బిగ్ బాస్ సీజన్ 7కి హోస్ట్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది.
మొత్తానికి వెండితెరపై బాక్సాఫీస్ బొనాంజా అనిపించుకున్న బాలయ్య ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో తో హోస్ట్ గా ఎవరికి అందనంత ఎత్తులో నిలబడ్డాడు. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6కి అతి తక్కువ టీఆర్పీలు నమోదయ్యాయి. దాంతో నిర్వాహకులు ఈ షోకి ఎలాగైనా మళ్ళీ క్రేజ్ తీసుకురావాలని భావించి బాలయ్యను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.
దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. అందువల్లే కాబోలు నాగార్జున సీజన్ సిక్స్ ముగింపులో మళ్ళీ కలుద్దాం అనే మాట అనలేదు. బాలకృష్ణ బిగ్ బాస్ సెవెన్‌కి హోస్టుగా మారితే మళ్ళీ ఆ షోకి వీక్షకుల్లో ఏ విధంగా క్రేజ్ వస్తుందనేది చూడాల్సి ఉంది.
మరోవైపు బిగ్ బాస్ 7కి రానా దగ్గుబాటి కూడా హోస్ట్ చేస్తాడనేలా వార్తలు వస్తున్నాయి. నెంబర్ వన్ యారి విత్ రానా షో తో ఆకట్టుకున్న ఆయనని నాగార్జున రికమెండ్ చేశారని అంటున్నారు. రానా అనారోగ్య పరిస్థితుల వల్ల సర్జరీ చేయించుకున్నాడు. దీంతో కొన్నాళ్లపాటు సినిమా షూటింగులకు దూరంగా ఉండమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది.
ఫైట్లు డాన్సులు చేయకుండా సినిమాలు చేయడం కష్టమే కాబట్టి కొన్నాళ్లపాటు రానా సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. అయితే పూర్తిగా సినిమాలు చేయకపోతే ప్రేక్షకులకి తనకు కనెక్షన్ దూరమవుతుందని బాధపడుతున్న రానాకు మోరల్ సపోర్టుగా నిలిచేందుకు ఆయన పేరుని నాగార్జున రికమెండ్ చేశాడు అంటున్నారు. ఇందులో నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎవరి పేరు ఎవరు రికమండ్ చేసినా ఫైనల్ డెసిషన్ మాత్రం స్టార్ మా యాజమాన్యం, ఎండోమోల్ షైన్ గ్రూప్ ది అని మాత్రం చెప్పక తప్పదు.