వేడివేడి బిర్యానీ ఊహిస్తే.. చద్ది పులిహోర పెట్టారు.. ‘బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్ రివ్యూ’
విధాత: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 2 షోకు తాజాగా ప్రభాస్, గోపీచంద్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎపిసోడ్‌కు సంబంధించి మొదటి భాగాన్ని తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. సర్వర్లు క్రాష్ అయ్యాయి అంటూ ఆహా టీం క్షమాపణ చెప్పింది. సబ్‌స్కైబర్స్ అరవింద్‌ని ట్రోల్ చేశారు. ఇదంతా జరిగాక ఏ తెల్లవారుజామున 3 గంటలకు ఎపిసోడ్ ప్రసారమవ్వడం ప్రారంభమైంది. అటు చూస్తే మ్యాన్షన్ హౌస్ బాలయ్య…. ఇటేమో సిగ్గరి ప్రభాస్… బాలయ్య ఏం మాట్లాడుతాడు? […]

విధాత: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 2 షోకు తాజాగా ప్రభాస్, గోపీచంద్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎపిసోడ్‌కు సంబంధించి మొదటి భాగాన్ని తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. సర్వర్లు క్రాష్ అయ్యాయి అంటూ ఆహా టీం క్షమాపణ చెప్పింది.
సబ్‌స్కైబర్స్ అరవింద్‌ని ట్రోల్ చేశారు. ఇదంతా జరిగాక ఏ తెల్లవారుజామున 3 గంటలకు ఎపిసోడ్ ప్రసారమవ్వడం ప్రారంభమైంది. అటు చూస్తే మ్యాన్షన్ హౌస్ బాలయ్య…. ఇటేమో సిగ్గరి ప్రభాస్… బాలయ్య ఏం మాట్లాడుతాడు? ప్రభాస్ ఏమి చెప్తాడు? అని అందరు బాగా ఆశగా ఎదురుచూశారు.
తీరా ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. బాహుబలి రేంజ్ బిల్డప్‌కి, ఆది పురుష్‌లాంటి టీజర్‌ను వదిలారని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇది బాగోలేదా అంటే బాగుందని కాదు.. అలాగా ఏం లేదు.. అని కాదు. అంటే ఇది ఒక బిలో యావరేజ్ టాక్‌తో నడిచింది అని చెప్పాలి.
ఈమధ్య బాలయ్య సిద్దు, విశ్వక్సేన్, శర్వానంద్, అడవి శేషు వంటి వారిని తమ బంధాల గురించి చెప్పించాలని తీవ్ర ప్రయత్నం చేశారు. కొంతమందికి తన మెన్షన్ హౌస్ ప్రతాపాన్ని చూపించి రాబట్టారు. అది కూడా పూర్తిగా కాదులేండి.. ఏదో తూతుమంత్రంగా మాత్రమే. ఇక ప్రభాస్ విషయంలోనూ అదే జరిగింది.
కృతిసనన్‌తో తనకి ఏమీ లేదని ప్రభాస్ చెపుతున్నా మీ అమ్మకు చెప్పిన మాటలు నాకు చెప్పకు అంటూ బాలయ్య డైలాగ్ బాగున్నప్పటికీ దాన్నే సాగదీస్తూ విసుగు పుట్టించారు. రాధేశ్యామ్‌లో హస్తసాముద్రికా జ్యోతిష్యునిగా కనిపించిన ప్రభాస్‌కు బాలకృష్ణ తన చేతిని చూపించి జాతకం ఎలా ఉంది? అని అడిగాడు.
మీకేంటి సార్ మరో 10 ఏళ్లు బ్రహ్మాండంగా సాగుతుంది అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. కానీ బాలయ్య చేతిలో అన్ స్టాపబుల్ అని రాసి ఉంది అంటే.. అన్ స్టాపబుల్ షో మరో 10 ఏళ్ల పాటు సాగుతుందని ప్రభాస్ అర్థమేమో ఎవరికి అర్థం కాదు.
ఆహా కంటెంట్ టీం ఎంత నాసిరకంగా ఉందో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఏదో ఒక నెంబర్ గేమ్ ఆడుతూ ఆ నంబరు ఉన్న స్లిప్‌లో ప్రశ్నను బాలకృష్ణ అడుగుతాడు. విచిత్రమేమం టే ఆ పేపర్ పై ఏమి రాసి ఉండదు. ఏ ప్రశ్న ఉండదు. అదేంటి అంటే నా ఇష్టం అంటాడు బాలకృష్ణ.
సమాధానం చెప్పాలనుకుంటే చెప్పు లేదంటే వద్దు అంటాడు. రిమోట్ బటన్ను కూడా బాలకృష్ణ ప్రభాస్ చేతికి ఇచ్చాడు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ నాకు ఇష్టం లేదని రిమోట్ బటన్ నొక్కినప్పటికీ బాలకృష్ణ వదల్లేదు. మొత్తానికి ఆహా టీం తమ నాసిరకమైన పైత్యాన్ని ఈ ఎపిసోడ్‌పై చూపించింది.
ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం చూస్తే మైనస్లు బోలెడు ఉన్నాయి. వేడివేడి బిర్యానీ పెడతారని ఊరించి మూడు రోజుల నాటి చద్ది పులిహోర పెట్టినట్టుగా ఈ ఎపిసోడ్ సాగిందని.. ఇది ఒక కిచిడి ప్రోగ్రాం అని అందరూ కామెంట్ చేస్తున్నారు. మరి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి..!