బాలయ్య అల్లుడు.. సినీ ఎంట్రీ!

విధాత: గతంలో సీనియర్ ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై పలు చిత్రాలను నిర్మించాడు. ఆ తరువాత ఆ సంస్థ మూతపడింది. హ‌రికృష్ణ ఉన్న‌ప్పుడు కాస్త గాడిలో పెట్టాల‌నుకున్నాడు. ఇక బాల‌య్య ఇటీవ‌ల ఒకటి రెండు చిత్రాల నిర్మించినా అవి సరిగా ఆడలేదు. ముఖ్యంగా త‌న తండ్రిపై తీసిన బ‌యోపిక్‌లు క‌లిసి రాలేదు. తాజాగా బాలయ్య కాంపౌండ్ నుంచి ఆయన అల్లుడు, గీతా విద్యాసంస్థల అధినేత, నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు మ‌తుకుపల్లి శ్రీ భరత్ సినిమా […]

  • By: krs    latest    Dec 27, 2022 5:39 AM IST
బాలయ్య అల్లుడు.. సినీ ఎంట్రీ!

విధాత: గతంలో సీనియర్ ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై పలు చిత్రాలను నిర్మించాడు. ఆ తరువాత ఆ సంస్థ మూతపడింది. హ‌రికృష్ణ ఉన్న‌ప్పుడు కాస్త గాడిలో పెట్టాల‌నుకున్నాడు. ఇక బాల‌య్య ఇటీవ‌ల ఒకటి రెండు చిత్రాల నిర్మించినా అవి సరిగా ఆడలేదు. ముఖ్యంగా త‌న తండ్రిపై తీసిన బ‌యోపిక్‌లు క‌లిసి రాలేదు.

తాజాగా బాలయ్య కాంపౌండ్ నుంచి ఆయన అల్లుడు, గీతా విద్యాసంస్థల అధినేత, నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు మ‌తుకుపల్లి శ్రీ భరత్ సినిమా ఇండస్ట్రీ‌లోకి రాబోతున్నాడనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పెద్దల్లుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చురుకైన పాత్రను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం బాలయ్య సినిమాలు, షోలకు సంబంధించిన వ్యవహారాలను ఆయన రెండో కుమార్తె తేజస్విని దగ్గరుండి చూసుకుంటుంది. ముఖ్యంగా బాలయ్య గెటప్పులు, స్టైలింగ్ వంటివి ఆమె చూస్తున్నారు. అలానే తండ్రితో షూటింగ్‌కి వెళ్తూ సినిమా నిర్మాణ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. త్వరలో ఆమె నిర్మాతగా సినిమా చేయబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో ప్లానింగ్‌లో ఉన్న ఆదిత్య 369 సీక్వెల్‌ను సొంత బ్యానర్ లో నిర్మించ‌నుంద‌ని వార్తలు వస్తున్నాయి. దీనికి తేజస్విని నిర్మాతగా ఉంటార‌ట.

కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బాలయ్యతో బోయపాటి తీసే సినిమాలో 20% వాటాను తేజస్విని, ఆమె భర్త శ్రీ భరత్‌ల‌కు ఉండేలా చర్చలు సాగుతున్నాయి అని తెలుస్తోంది. బాలయ్య- బోయపాటి సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అలానే మరికొందరు కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వాములుగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో 20% పెట్టుబడి పెట్టడానికి తేజస్విని, ఆమె భర్త శ్రీ భరత్ ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

ఈ సినిమా 2023 అంటే వచ్చే ఏడాది జూన్ నుంచి సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలయ్య న‌టించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్దంగా ఉంది. అనిల్ రావిపూడి‌తో చేస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి సినిమా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే.

మరి ఈసారి పెద్ద హిట్ కొట్టడంతో పాటు తన కూతురు, అల్లుళ్లను లాభాల బాటలో నడిపించేలా బాలయ్య కృషి చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఈ వార్త నిజమో, కాదో తెలియదు కానీ.. ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుక్కారణం అల్లుడు నిర్మాత అవుతున్నాడని కాదు.. మళ్లీ బోయపాటి కాంబినేషన్ అని. అది మ్యాటర్.