అభివృద్ధి చేశాం.. ఆశీర్వదించండి: బాల్క సుమన్

అభివృద్ధి చేశాం.. ఆశీర్వదించండి: బాల్క సుమన్

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: చెన్నూరు నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, మరోసారి బీఆరెస్ కు ఓటేసి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి బస్టాండ్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


రామన్ కాలనీ వద్ద ఆర్ఓబీ నిర్మాణం అలైన్మెంట్ మార్చడం వల్ల 200పైగా ఇండ్లు నేలమట్టం కాకుండా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం బస్టాండ్ ఏరియాలోని వర్తక సంఘం సభ్యులతో కలిసి దుకాణాల్లో మ్యానిఫెస్టో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో వర్తక, వాణిజ్య వ్యాపార సముదాయంలో ప్రచారం కొనసాగించారు. బీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.