Bandi Sanjay | వరంగల్ కోర్టుకు బండి సంజయ్.. కారు అద్దాలకు పేపర్లు

ప్రత్యేక కాన్వాయ్ లో తరలింపు.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పోలీసులు ఆలేరు సమీపంలో వరంగల్ పోలీసులకు హ్యాండోవర్ వరంగల్ లో బండిపై కేసు ఫైల్.. జడ్జి ముందు హాజరుపర్చే చాన్స్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ను పోలీసులు వరంగల్ కోర్టుకు తీసుకోస్తున్నారు. భువనగిరి కోర్టులో హాజరుపరుస్తు్న్నామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత రోడ్డెక్కిన […]

  • Publish Date - April 5, 2023 / 06:31 AM IST
  • ప్రత్యేక కాన్వాయ్ లో తరలింపు..
  • కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పోలీసులు
  • ఆలేరు సమీపంలో వరంగల్ పోలీసులకు హ్యాండోవర్
  • వరంగల్ లో బండిపై కేసు ఫైల్..
  • జడ్జి ముందు హాజరుపర్చే చాన్స్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ను పోలీసులు వరంగల్ కోర్టుకు తీసుకోస్తున్నారు. భువనగిరి కోర్టులో హాజరుపరుస్తు్న్నామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత రోడ్డెక్కిన తర్వాత పోలీస్ వాహనాల కాన్వాయ్ వరంగల్ వైపు మళ్లించారు.

YouTube video player

ఆలేరు వద్ద వరంగల్ పోలీసులు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ.. ఆయనపై వరంగల్ లో కేసు ఫైల్ అయ్యింది. పీఎస్ నుంచి కోర్టులో హాజరుపర్చటానికి తీసుకెళుతున్న సమయంలో.. కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టారు.

కారులోని వ్యక్తులు బయటకు కనిపించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. వరంగల్ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంజయ్‌ను తరలిస్తుండగా కారును ఆలేరు సమీపంలోని పెంబర్తి వద్ద బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే బీజేపీ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు బండి సంజయ్‌ను తరలించారు.

అయితే.. బండి సంజయ్ ను పోలీసులు జనగామ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చ తర్వాత కొద్దిసేపటి తరువాత బండి సంజయ్ ను పాలకుర్తివైపు తీసుకెళుతున్నారు. అక్కడ వైద్యపరీక్షలునిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అక్కడినుంచి పోలీసులు వరంగల్ కోర్టుకు తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

కేసు ఏమిటో చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండా బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు వివిధ రూట్ల మీదుగా తీసుకెళుతున్నారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు బండి సంజయ్ ను పోలీసులు తీసుకొచ్చారు.