ద్రోహం చేయడంలో కాంగ్రెస్ దిట్ట

ప్రజలకు ద్రోహం చేసి అధికారం చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట అని, ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకం తో పేదలను ఆడుకుంటామని అధికారం

ద్రోహం చేయడంలో కాంగ్రెస్ దిట్ట
  • ఆరు గ్యారంటీల అమలు కాంగ్రెస్‌కు కష్టమే
  • బీఆరెస్ దగాకోరు పార్టీ
  • ఆ పార్టీ కొంపముంచిందే కేటీఆర్
  • పార్లమెంట్ ఎన్నికల్లో పది స్థానాలు గెలుస్తాం
  • బీజేపీ ప్రవాస యోజన సమావేశంలో బండి సంజయ్

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ప్రజలకు ద్రోహం చేసి అధికారం చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట అని, ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకం తో పేదలను ఆడుకుంటామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నేడు అమలు చేసేందుకు నానా తంటాలు పడుతున్నదని రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ ప్రవస యోజన సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి మాట్లాడుతూ కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పై నిప్పులు చెరిగారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు చెప్పి ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ పథకాల అమలు కు మీనావేశాలు లెక్కబె డుతున్నదని ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరెస్‌ పెట్టేబెడా సద్దుకోవాలన్నారు. పాలమూరు జిల్లా బీజేపీ పార్టీకి అడ్డా అని పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి తెలిపారు.

తెలంగాణ లో పదికి పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. బీఆరెస్ పార్టీ దగాకోరు పార్టీ అని, ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురించేసిందన్నారు. బీఆరెస్‌లో భూముల కబ్జాలకు పాల్పడిన నాయకులందరు నేడు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాలపై బీఆరెస్‌ పార్టీ చేస్తున్న మోసాలపై బీజేపీ ప్రజల్లోకి వాస్తవ విషయాలను తీసుకెళ్తుందని, గత ప్రభుత్వాలు చేసిన అక్రమాలను బీజేపీ బయటపెట్టిందన్నారు. కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని, ఇప్పటికి కేసీఆర్ సీయం అనుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బీఆరెస్‌ పార్టీ కొంప ముంచిందే కేటీఆర్ అని బండి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరులో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందని, మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికవుతారన్నారు. కాంగ్రెస్, బీఆరెస్‌ పార్టీ లు రెండు ఒక్కటే అని బండి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో బీజేపీ క అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాల్సిందే అని, నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తే గెలుపు ఖాయమన్నారు.ఈ సమావేశంలో బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శృతి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.