October Bank Holidays | అక్టోబర్‌లో బ్యాంకులకు 15రోజులు సెలవులే.. ఏమైనా పనులుంటే చక్కబెట్టుకోండి మరి..!

October Bank Holidays | అక్టోబర్‌లో బ్యాంకులకు 15రోజులు సెలవులే.. ఏమైనా పనులుంటే చక్కబెట్టుకోండి మరి..!

October Bank Holidays | సెప్టెంబర్‌ నెల పూర్తికావొచ్చింది. అక్టోబర్‌ మాసం మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకుల సెలవులను ప్రకటించింది. అక్టోబర్‌ మాసంలో దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో శని, ఆదివారాలతో పాటు సెలవులు సైతం ఉన్నాయి. దసరా పండుగ నేపథ్యంలో అక్టోబర్‌ చివరి వారంలో బ్యాంకు సేవలు సెలవులతో నిలిచిపోనున్నాయి. అయితే, ఆర్థికపరమైన పనుల కోసం బ్యాంకులకు వెళ్లే వారు తప్పనిసరిగా సెలవుల గురించి తెలుసుకోవాలి. లేకపోతే అత్యవసర సమయంలో బ్యాంకులు మూసి ఉంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ముందుగా సెలవులుగా గురించి తెలుసుకుంటే.. అప్పటి వరకే బ్యాంకు పనులను చక్కబెట్టుకునేందుకు వీలు కలుగుతుంది. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు, యూపీఐ సర్వీసులు కొనసాగనున్నాయి. వీటితో డబ్బులను విత్‌డ్రా చేసుకోవడంతో పాటు పంపేందుకు అవకాశం ఉంటుంది. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, పలు సర్వీసుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి రాక తప్పదు. అయితే, సెలవుల గురించి తెలుసుకుంటే ఇబ్బందులుండవు. మరి అక్టోబర్‌లో ఆర్‌బీఐ విడుదల చేసిన సెలవులను పరిశీలిద్దాం రండి..!

అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..

  • అక్టోబర్​ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
  • అక్టోబర్​ 14న రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్​ 15న ఆదివారం సందర్భంగా సెలవు.
  • అక్టోబర్​ 18న కాతి బిహు సందర్భంగా అసోంలో బ్యాంకులకు హాలీడే.
  • అక్టోబర్​ 19న సంవత్సరి పండుగ కావడంతో గుజరాత్​ బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్​ 21న దుర్గాపూజ సందర్భంగా హాలీడే.
  • అక్టోబర్​ 22న ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
  • అక్టోబర్‌ 23న మహా నవమి సందర్భంగా సెలవు.
  • అక్టోబర్​ 24న దసరా పండుగ సందర్భంగా సెలవు.
  • అక్టోబర్​ 25న దుర్గా పూజ (దసై) సందర్భంగా హాలీ డే.
  • అక్టోబర్​ 26న యాక్సెషన్​ డే నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో బ్యాంకులకు హాలీ డే.
  • అక్టోబర్‌ 27న దుర్గా పూజ సందర్భంగా సెలవు.
  • అక్టోబర్​ 28న నాలుగో శనివారం, లక్ష్మీ పూజ సందర్భంగా హాలీ డే
  • అక్టోబర్​ 29న ఆదివారం సెలవు.
  • అక్టోబర్​ 31న సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా సెలవు.