Bank Working Days | ఇక వారంలో ఐదు రోజులే బ్యాంకులు ఓపెన్‌..! ఈ నెలలోనే ప్రకటించే అవకాశం..!

Bank Working Days | దేశవ్యాప్తంగా బ్యాంకుల పది దినాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మాదిరిగా తమకు సైతం ప్రతి వారం రెండు రోజులు (శనివారం, ఆదివారం) సెలవులు ఇవ్వాలని బ్యాంకింగ్ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, ఇందుకు ప్రతిగా నిత్యం 40 నిమిషాలు అదనంగా పని చేస్తామని పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ నెల 28న సమావేశం కానున్నది. ఈ […]

Bank Working Days | ఇక వారంలో ఐదు రోజులే బ్యాంకులు ఓపెన్‌..! ఈ నెలలోనే ప్రకటించే అవకాశం..!

Bank Working Days |

దేశవ్యాప్తంగా బ్యాంకుల పది దినాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మాదిరిగా తమకు సైతం ప్రతి వారం రెండు రోజులు (శనివారం, ఆదివారం) సెలవులు ఇవ్వాలని బ్యాంకింగ్ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, ఇందుకు ప్రతిగా నిత్యం 40 నిమిషాలు అదనంగా పని చేస్తామని పేర్కొన్నారు.

ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ నెల 28న సమావేశం కానున్నది. ఈ కీలక భేటీలో ఐదురోజుల పనిదినాల నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అదే రోజు ఇందుకు ప్రకటన నచేసే అవకాశాలున్నాయి. వారంలో పనిదినాలు ఐదు రోజులకు తగ్గనున్నందున బ్యాంకులు పని చేసే రోజుల్లో ఉద్యోగులు 40 నిమిషాలు ఎక్కువ పని చేసేలా ప్రతిపాదించారు.

అయితే, 5 రోజుల పనిదినాల విషయంపై ఐబీఏతో ఇప్పటికే చర్చించామని, ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఇటీవల తెలిపింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఐబీఏ చెప్పిందని వెల్లడించింది. వచ్చే శుక్రవారం జరుగనున్న భేటీలో పని దినాలతో పాటు వేతనాల పెంపు, విశ్రాంత ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు మినహా మిగతా రోజులు పని చేస్తున్నాయి. మొదటి శనివారం, మూడో శనివారం వీక్లీ ఆఫ్ కావాలని ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేస్తున్నది. వారానికి రెండు వీక్లీ ఆఫ్‌లు తీసుకొని.. పనిదినాల్లో 40 నిమిషాలు అదనంగా పని చేస్తామని చెబుతున్నది.

కాగా, ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ పనిదినాలను కేంద్రం వారానికి ఐదు రోజులకు కుదిచింది. అప్పటి బ్యాంకు ఉద్యోగులు సైతం తమకూ వారానికి ఐదురోజులే పనిదినాలు కావాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. మరో వైపు ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ సైతం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

అలాగే రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగులకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ విషయంపై యూబీఎఫ్‌ఐ క్లారిటీ ఇచ్చింది. బెడ్‌ ఛార్జీలు, ప్యాకేజీలపై ఖచ్చితమైన సీలింగ్స్, క్యాప్స్‌తో బేస్ పాలసీ రూ.2లక్షలు ఉండనున్నట్లు పేర్కొంది. ప్రీమియం అమౌంట్ తగ్గనున్నట్లు తెలిపింది. విశ్రాంత ఉద్యోగులు అవసరమైతే రూ.10 లక్షల వరకు టాప్‌అప్ చేసుకునే వెలుసుబాటు ఇవ్వనున్నట్లు వివరించింది.