BC FUND | బీసీల ఆర్థిక‌ సాయానికి విధివిధానాలు ఖ‌రారు.. కుటుంబంలో ఒక్క‌రికే!

BC FUND | విధాత: బీసీల్లోని కుల‌వృత్తులు, చేతివృత్తుల వారికి రూ.ల‌క్ష గ్రాంట్‌గా ఆర్థిక సాయం అందించ‌నున్నారు. ఒక్కో కుటుంబంలో ఒక్క‌రికి మాత్ర‌మే ఆర్థిక సాయం అందించ‌నున్నారు. 18 నుంచి 55 ఏండ్ల వ‌య‌సు మ‌ధ్య ఉన్న‌వారికి వ‌ర్తించ‌నుంది. గ్రామాల్లో రూ. 1.50 ల‌క్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న‌వారికి, ప‌ట్ట‌ణాల్లో రూ. 2 ల‌క్ష‌ల లోపు వార్షిక ఆదాయం ఉన్న‌వారికి ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌నుంది. ఐదేండ్లుగా ప‌థ‌కాల ద్వారా రూ. 50 వేలు పొందిన వారికి […]

  • By: krs    latest    Jun 06, 2023 2:01 PM IST
BC FUND | బీసీల ఆర్థిక‌ సాయానికి విధివిధానాలు ఖ‌రారు.. కుటుంబంలో ఒక్క‌రికే!

BC FUND |

విధాత: బీసీల్లోని కుల‌వృత్తులు, చేతివృత్తుల వారికి రూ.ల‌క్ష గ్రాంట్‌గా ఆర్థిక సాయం అందించ‌నున్నారు. ఒక్కో కుటుంబంలో ఒక్క‌రికి మాత్ర‌మే ఆర్థిక సాయం అందించ‌నున్నారు. 18 నుంచి 55 ఏండ్ల వ‌య‌సు మ‌ధ్య ఉన్న‌వారికి వ‌ర్తించ‌నుంది.

గ్రామాల్లో రూ. 1.50 ల‌క్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న‌వారికి, ప‌ట్ట‌ణాల్లో రూ. 2 ల‌క్ష‌ల లోపు వార్షిక ఆదాయం ఉన్న‌వారికి ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌నుంది.

ఐదేండ్లుగా ప‌థ‌కాల ద్వారా రూ. 50 వేలు పొందిన వారికి మిన‌హాయింపు ఆర్థిక సాయం పొందాల‌నుకునే వారు ఈ ఏడాది జూన్ 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

జూన్ 20 నుంచి 27వ తేదీ వ‌ర‌కు మండ‌ల‌, మున్సిప‌ల్ స్థాయిలో ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించ‌నున్నారు.
జూన్ 27 నుంచి జులై 4వ తేదీ వ‌ర‌కు జిల్లా స్థాయి క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

ద‌శ‌ల వారీగా ఆర్థిక సాయం పొందే ల‌బ్దిదారుల పేర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌తి నెల 15వ తేదీన బీసీ ల‌బ్దిదారుల‌కు ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్నారు.