Suchetana Bhattacharya | లింగ మార్పిడి చేయించుకోనున్న మాజీ సీఎం కుమార్తె
Suchetana Bhattacharya | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. లింగ మార్పిడి చేయించుకొని, పురుషుడిగా ఉండాలని నిర్ణయించు కున్నట్లు సుచేతన తెలిపారు. ఇందుకోసం న్యాయ సలహా, వైద్యుల సలహా తీసుకుంటున్నట్లు సుచేతన తెలిపింది. ఇందుకు కావాల్సిన సర్టిఫికెట్లను రెడీ చేసుకుంటున్నట్లు సుచేతన్‌గా మారబోయే సుచేతన పేర్కొంది. ఇటీవలే సుచేతన ఎల్జీబీటీక్యూ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. దీంతో పుట్టుక నుంచే తాను పురుషుడినన్న ఆమె నమ్మకం మరింత బలపడింది. […]

Suchetana Bhattacharya |
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. లింగ మార్పిడి చేయించుకొని, పురుషుడిగా ఉండాలని నిర్ణయించు కున్నట్లు సుచేతన తెలిపారు. ఇందుకోసం న్యాయ సలహా, వైద్యుల సలహా తీసుకుంటున్నట్లు సుచేతన తెలిపింది. ఇందుకు కావాల్సిన సర్టిఫికెట్లను రెడీ చేసుకుంటున్నట్లు సుచేతన్‌గా మారబోయే సుచేతన పేర్కొంది.
ఇటీవలే సుచేతన ఎల్జీబీటీక్యూ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. దీంతో పుట్టుక నుంచే తాను పురుషుడినన్న ఆమె నమ్మకం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో లింగ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది.
నా తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల గుర్తింపు పెద్ద సమస్య కాదని సుచేతన చెప్పింది. ఎల్జీబీటీక్యూ ఉద్యమంలో భాగంగానే తాను లింగమార్పిడి చేయించుకుంటున్నాను. ట్రాన్స్ మ్యాన్‌గా ప్రతి రోజు సమాజం నుంచి ఎదుర్కొంటున్న వేధింపులకు లింగమార్పిడితో తెరదించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.
ప్రస్తుతం నా వయసు 41 ఏండ్లు. ఈ వయసులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందన్నారు. కాబట్టి ఈ విషయంలోకి నా తల్లిదండ్రులను లాగొద్దని సూచించింది. తాను పురుషుడిగా ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది.
చిన్నప్పటి నుంచి తన గురించి తెలిసిన తండ్రి, తన నిర్ణయానికి మద్దతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై రాద్ధాంతం చేయవద్దని మీడియాను ఆమె కోరింది.