American Woman’s Hilarious Video | బెంగళూరు ట్రాఫిక్‌లో హారన్ అర్థాలు ఇలా ఉంటాయి : అమెరికన్ మహిళ సరదా వీడియో
అమెరికన్ మహిళ డానా మేరీ బెంగళూరు రోడ్ల మీద హారన్ మర్యాదలు ఎలా ఉంటాయో, చతురతతోనైనా, స్పష్టంగా వీడియోలో వివరించింది.

బెంగళూరు నగరం—ఇక్కడ ట్రాఫిక్ అంటేనే ఓ ప్రత్యేక అనుభవం. జామ్‌ల మధ్యలో మోగుతూ ఉండే హారన్‌లో సంగీతం, మోటార్ సైకిళ్ల మధ్య లోపురాలు… ఈ అల్లకల్లోలాన్ని ఒక అమెరికన్ మహిళ తనదైన స్టయిల్లో హాస్యంగా బరించడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
డానా మేరీ (Dana Marie) అనే ఈ అమెరికన్ మహిళ, బెంగళూరు వీధుల్లో డ్రైవ్ చేస్తూ, హార్న్లకు ఇచ్చే వివిధ అర్ధాలను హాస్యంతో but నిజాయితీగా వివరించారు:
- ఒక హార్న్ — “హలో.. ఇక్కడ నేనున్నాను.”
- మీడియం హార్న్ — “భయ్యా..ఏం చేస్తున్నావ్.. నా లేన్‌లో నుండి పక్కకెళ్లు. ”
- ఇక దీని తర్వాత రోడ్డుమీదే రెండు కార్లు విండో దించి వాదిస్తుంటారు.
- రెండు హార్న్లు — “ఇప్పుడు నేను మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తున్నాను. పక్కకు జరగండి
- చిన్న చిన్న బీప్స్.. “ఒకటి తర్వాత ఒకటి — “బాబూ.. ఒకసారి ఆగు. నీతో మాట్లాడాలి.”
- అత్యంత పొడవైన హార్న్, బ్రేక్‌తో.. “వెంటనే తప్పుకో. లేకపోతే ఢీ కొట్టుకుని ఇద్దరం గాయపడతాం!”
- బైక్ డిప్పర్ (headlight ఫ్లాష్)— “నా దారి నుండి తప్పుకో..
డానా వీడియో కేవలం హాస్యచతురత కోసమే కాదు ఇది బెంగళూరులోని ట్రాఫిక్ సంస్కృతి—ప్రయాణం ఒక సామాజిక సంభాషణగా ఎలా మారుతుందో తెలుపుతోంది.
నెటిజన్ల సరదా వ్యాఖ్యలు:
ALSO READ : Revanth Reddy| హరీష్ రావు సభను..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
“Give her Aadhar. Time అయిపోయింది!”
- “Most polite explanation I’ve ever heard.”
- “Apply for Indian PR now!”
ఈ విధంగా వారి కామెంట్లు ఈ వీడియోని మరింత ఫన్నీగా మార్చాయి.