Hanumakonda : హనుమకొండలో 24 నుంచి భట్టి పాదయాత్ర
Hanumakonda నాలుగు రోజుల పాటు కార్యక్రమం కమలాపూర్ నుంచి వేలేరు వరకు పలుచోట్ల కార్నర్ మీటింగులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఈ నెల 24 నుండి హన్మకొండ(Hanumakonda) జిల్లాలో సి.ఎల్.పి నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతుందని టిపిసిసి ఉపాధ్యక్షురాలు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్రు శోభారాణి ప్రకటించారు. హన్మకొండ(Hanumakonda)లో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభ మైన భట్టి పాదయాత్ర […]

Hanumakonda
- నాలుగు రోజుల పాటు కార్యక్రమం
- కమలాపూర్ నుంచి వేలేరు వరకు
- పలుచోట్ల కార్నర్ మీటింగులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఈ నెల 24 నుండి హన్మకొండ(Hanumakonda) జిల్లాలో సి.ఎల్.పి నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతుందని టిపిసిసి ఉపాధ్యక్షురాలు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్రు శోభారాణి ప్రకటించారు.
హన్మకొండ(Hanumakonda)లో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభ మైన భట్టి పాదయాత్ర 24న హన్మకొండ జిల్లాకు రానుంది. 27 వరకు హన్మకొండ జిల్లాలో పాదయాత్ర సాగిన అనంతరం జనగామలో ప్రవేశించనున్నారు.
పాదయాత్ర రూట్ మాప్
24న కమలాపూర్ నుంచి ప్రారంభమై కాకతీయ యూనివర్సిటీకి చేరుకుని నైట్ హాల్ట్ చేస్తారు. 25న కాకతీయ యూనివర్సిటీలో మేధావులతో, విద్యార్థి, ఉద్యమకారులతో సమావేశమవుతారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి మెట్టుగుట్టకు చేరుకుని నైట్ హాల్ట్ చేస్తారు. 26న మెట్టుగుట్ట నుంచి ప్రారంభమై నారాయణగిరిలో నైట్ హాల్ట్ చేస్తారు. 27న నారాయణగిరి నుంచి యాత్ర ప్రారంభమై వేలేర్లో నైట్ హాల్ట్ చేస్తారు. అక్కడి నుంచి జనగామ జిల్లాలోకి చేరుతుంది.
కేసిఆర్ కుటుంబానికే ఉద్యమ ఫలాలు
అనేక ఉద్యమాలు నిర్వహించి సాధించిన తెలంగాణలో ఫలాలన్నీ కేసీఆర్ కుటుంబానికి మాత్రమే దక్కాయని శోభ రాణి విమర్శించారు. లీకుల నిలయంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. అక్రమార్జనలో కెసిఆర్ కుటుంబం అగ్రభాగాన ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడ గొట్టాలనే ఆలోచన తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. బిజిపి, మోడిలు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాయని విమర్శించారు. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అదాని సంస్థలకు మోడీ ఎలా దోచిపెట్టారని విమర్శించారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అవినీతిని గడప గడపకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్య పరిపాలన సాధించే దిశలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, కూచన రవళి, నమిండ్ల శ్రీనివాస్, తోట వెంకటేశ్వర్లు, డాక్టర్ పులి అనిల్ కుమార్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మతి విక్రం, కూర వెంకట్, పల్లకొండ సతీష్, గుంటి స్వప్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ తౌటం రవీందర్, నల్ల సత్యనారాయణ, దేశిని మల్లయ్య, జి. రమణా రెడ్డి,పల్లె రాహుల్ రెడ్డి, బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు.