భూమి సునీల్‌కు పితృ వియోగం
భూమి చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు అయిన నల్సార్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ భూమి సునీల్ ఇంట విషాదం నెలకొన్నది

నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు
విధాత: భూమి చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు, నల్సార్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ భూమి సునీల్ ఇంట విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి సంజీవరెడ్డి (65) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న సంజీవరెడ్డికి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు.
అయితే సంజీవరెడ్డిని పరిశీలించిన డాక్టర్లు ఆయన మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారని తెలియజేశారు. కుటుంబ సభ్యులు సంజీవరెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని అయ్యగారి పల్లెకు తీసుకువెళ్లారు. అక్కడే మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సంజీవరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. సంజీవరెడ్డి మృతికి డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డితో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.