మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్..

మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఎదురైంది. చెన్నూరు నియోజకవర్గంలోని ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆరెస్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు

మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్..
  • కారు దిగి కాంగ్రెస్ లో చేరిన
  • ఖ్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఎదురైంది. చెన్నూరు నియోజకవర్గంలోని ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆరెస్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మరో ఏడుగురు కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖ్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, ఏడుగురు కౌన్సిలర్లు బీఆరెస్ కు గుడ్ బై చెప్పారు. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం కోసం ఈ నెల 10న నోటీసులు జారీ చేశారు.

ఏడుగురు కౌన్సిలర్లతోపాటు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కు భారీ షాక్ అని చెప్పవచ్చు. ఈ దెబ్బతో మంచిర్యాల జిల్లాలోని మెజార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నది. మంచిర్యాల మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్ లు పదవి నుండి తొలగించబడ్డారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ నుండి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది.

అలాగే నస్పూర్ మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గి, బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించబడ్డారు. లక్షేట్టిపేట మున్సిపాలిటీ సైతం అవిశ్వాసం నెగ్గి, బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్ ల పదవి పోయింది. దాదాపుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ త్వరలో పాగా వెయ్యబోతున్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది.